ఆంధ్రప్రదేశ్‌

ఇక మైనర్లకూ డ్రైవింగ్ లైసెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 19: మైనర్లూ ఇక మీదట డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హులే. 16 ఏళ్ళు నిండితే చాలు 100 సిసి, గేర్‌లెస్ మోటారు సైకిళ్లు నడిపేందుకు యువతకు లైసెన్స్ మంజూరు చేయాలని నిర్ణయించారు. రాజస్థాన్ రవాణా మంత్రి సారథ్యంలో 18 రాష్ట్రాలకు చెందిన రవాణా మంత్రులతో కూడిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని రహదారి భద్రత సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చైర్మన్ యూనిస్ ఖాన్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఇక మీదట భారతదేశం అంతటా ఒకే లైసెన్సింగ్ విధానాన్ని అమలు చేయాలని తమ బృందం సిఫార్సు చేసిందన్నారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు పాల్పడితే వాహన యజమాని, లేదా మైనర్ తల్లిదండ్రులను బాధ్యులు చేయాలని సూచించామన్నారు.