రాష్ట్రీయం

‘డిఎన్‌ఎ ఇండెక్స్’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అగస్టు 20: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన ‘డిఎన్‌ఏ ఇండెక్స్ సిస్టమ్’ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించారు. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా కేవలం రెండు గంటల్లోనే డిఎన్‌ఏ శాంపిల్స్ ఫలితాలు తెలుసుకోవచ్చని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఇప్పటికే విజయవాడలో రీజనల్ ఫోరెన్సిక్ లేబొరేటరీని కొద్దిరోజుల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా.. టెక్నికల్ ఎవిడెన్స్ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న అనేక కేసుల విచారణకు ఫోరెన్సిక్ ల్యాబ్, డిఎన్‌ఏ పరీక్షల ఫలితాలు దోహద పడతాయన్నారు. అమెరికా సాంకేతిక పరిఙ్ఞనంతో మిళితమైన ర్యాపిడ్ హిట్ డిఎన్‌ఏ సిస్టమ్ ద్వారా రూపొందించిన ఈ ఆధునిక డిఎన్‌ఏ టెక్నాలజీని ఇందులో వినియోగించడం జరుగుతుంది. దంత, అంగిటి నమూనాలతోపాటు, రక్త నమూనాలు, ఉమ్మి నమూనాలను పరీక్షించి కేవలం రెండు గంటల్లోపే ఫలితాలు రాబట్టవచ్చు.

చిత్రం.. డిఎన్‌ఎ టెస్ట్ మిషన్‌ను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు