రాష్ట్రీయం

22నుంచి నీట్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో పూర్తిసీట్లకు, ఎంపిక చేసిన కాలేజీల్లో 15 శాతం సీట్లకు నీట్ ర్యాంకు ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ 22న ప్రారంభం కానుంది. మెయిన్ కౌనె్సలింగ్ రిజిస్ట్రేషన్‌గా వ్యవహరించే ఈ ప్రక్రియ 22 ఉదయం ఒంటి గంట నుంచి 25 సాయంత్రం ఐదు గంటల వరకూ అందుబాటులో ఉంటుంది.
నాలుగు రోజులుపాటు రిజిస్ట్రేషన్ పూరె్తైన తర్వాత 26న 5 గంటల వరకూ ఆప్షన్లు నమోదు చేసి, దానిని లాక్ చేయాల్సి ఉంటుంది. 27 ఉదయం సీట్ల అలాట్‌మెంట్ ప్రాసెస్ పూర్తి చేస్తారు. 28న సీట్ల కేటాయింపును ప్రకటిస్తారు. వారంతా 29 నుంచి సెప్టెంబర్ 3లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రెండో దశ వెబ్ ఆప్షన్లను సెప్టెంబర్ 9 నుంచి 10 వరకూ నమోదు చేయాలి. సీట్ల కేటాయింపు ప్రాసెస్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. అనంతరం సీట్ల కేటాయింపు ప్రకటన 12న జరుగుతుంది. వారంతా సెప్టెంబర్ 13నుంచి సెప్టెంబర్ 20లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 20నాటికి మిగిలిపోయిన సీట్లను ఆయా రాష్ట్రాలకు నీట్ కమిటీ బదలాయిస్తుంది. వాటిని యాజమాన్య కోటాలో భర్తీ చేసుకునే వీలు కల్పిస్తారు. జాతీయస్థాయిలో జరిగిన నీట్‌లో 3,69,648 మంది అబ్బాయిలకు 3,37,572 మంది హాజరుకాగా 15శాతం కోటాలో 11,058 మంది, మొత్తం మీద 1,83,424 మంది అర్హత సాధించారు. 4,32,930 మంది అమ్మాయిలకు గానూ 15శాతం కోటాలో 8,266 మంది, మొత్తం మీద 2,26,049 మంది అర్హత సాధించారు. 15 మంది ట్రాన్స్ జండర్లకు 9మంది హాజరుకాగా, అందులో ఐదుగురు అర్హత సాధించారు.