ఆంధ్రప్రదేశ్‌

తల్లిదండ్రులుగా గర్విస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: సింధును చూసి తల్లిదండ్రులుగా తాము, బిడ్డగా భరతమాత గర్విస్తోందని ఆమె తండ్రి రమణ అన్నారు. సింధు రజత పతకం గెలుచుకోవడంపట్ల హైదరాబాద్‌లో ఆమె తండ్రి రమణ స్పందిస్తూ సింధు విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తొలి సెట్‌లో సింధు అద్భుతంగా ఆడినప్పటికీ రెండో సెట్, మూడో సెట్లలో అవకాశాలను పాయింట్లుగా మలచుకోవడంలో వెనుకబడిందని రమణ విశే్లషించారు. ప్రత్యర్థిని కోలుకోనివ్వకుండా ఆడటం ఎలా అన్నది సింధు నేర్చుకుంటోందన్నారు. ప్రత్యర్థి కరొలినా మారిన్... సింధుకు అవకాశం ఇవ్వకుండా అద్భుతంగా ఆడిందని ఆయన ప్రశంసించారు. అయినప్పటికీ సింధు దేశ ప్రజలను నిరాశపరచలేదని, దేశానికి బహుమతిగా రజత పతకం సాధించుకొచ్చిందని ఆయన అన్నారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇంతవరకు ఏ క్రీడాకారిణి సాధించని ఘనతను సింధు సాధించిందని రమణ ఉప్పొంగిపోయారు.