తెలంగాణ

నరుూంతో ఉన్నవారంతా టిఆర్‌ఎస్ వారే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 19: మాఫియా డాన్ నరుూం కేసును సిబిఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కాంగ్రెస్ నాయకుడు, నల్లగొండ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోమారు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల పరిషత్ సమావేశం అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాలలో వేలకోట్ల ఆస్తులు కూడబెట్టిన నరుూంతో పూర్తిగా అంటకాగిన వారు టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారేనని ఆయన ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన వారు ఉన్నందువల్ల సిఎం కేసిఆర్ ఆధ్వర్యంలో విచారణ చేసే సిట్ వల్ల బాధితులకు న్యాయం జరగదన్నారు. అలాగే టిఆర్‌ఎస్ నాయకులకు శిక్ష పడుతుందని తాము భావించడం లేదన్నారు. ఆ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. తనను ఎన్నికల్లో ఓడించడానికి అధికార టిఆర్‌ఎస్ నాయకులు నరుూంతో బెదిరింపులకు గురిచేశారని, లేదంటే తనకు 500 ఓట్ల మెజారిటీ వచ్చేదని వివరించారు. గత ఎన్నికల్లో కెసిఆర్ అబద్ధపు హామీలను ఇచ్చి గెలిచారన్నారు. కేసిఆర్ ఫాంహౌస్ దగ్గర తప్ప డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎక్కడా కట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీని ఒక్కసారే అమలు చేసిందన్నారు. కేసిఆర్ నాలుగు దఫాలుగా చేయడం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరిగిందని ఆరోపించారు.

నరుూం బంధువుల నుండి
రూ.10 లక్షల నగలు, నగదు లభ్యం
మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 19: గ్యాంగ్‌స్టర్ నరుూం అత్త, బావమరది, బావమరది భార్యలను ప్రత్యేక విచారణ బృందం (సిట్) అధికారులు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మూడురోజులపాటు విచారణ జరపగా, 10 లక్షల రూపాయల మేర నగదు, బంగారు, వెండి నగలు లభ్యమయ్యాయి, ఇంకా 20 మంది అనుచరగణం వివరాలు వెల్లడయ్యాయి. నరుూం అత్త సయ్యద్ సుల్తానా, బావమరది సయ్యద్ సాదిక్, అతని భార్య ఫర్జానాలను ఈ నెల 9న మిర్యాలగూడ ఒన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం వారి వద్ద నుండి విలువైన 240 ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలోని లాకర్ కీ లభించకపోవడంతో విచారణను వాయిదా వేసి, కోర్టులో హాజరుపర్చగా వారికి మెజిస్ట్రేట్ 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. జ్యుడీషియల్ కస్టడీ నుండి ఈనెల 17న సిట్ అధికారి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన విచారణలో ఆశ్చర్యకరమైనే విషయాలు వెల్లడయ్యాయి. సుమారు 28.9 తులాల బంగారు, 70 తులాల వెండి నగలు, 1,53,600 రూపాయలు నగదు బ్యాంక్ లాకర్‌లో లభ్యమయ్యాయి. నగల విలువ సుమారు 9 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారుల అంచనా. అదేవిధంగా 240 ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సిట్ ఇన్స్‌పెక్టర్ సుధాకర్, స్థానిక ఒన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్ డి.బిక్షపతి పరిశీలిస్తున్నారు. వాటి విలువ సుమారు 500 కోట్ల రూపాయలు వరకు ఉండవచ్చని అంచనా వేశారు. ఇంకా నిశితంగా పరిశీలన అనంతరం పూర్తి విలువ నిర్ధారించవచ్చని వారు అంటున్నారు. ఇదే కాక మిర్యాలగూడ పట్టణం, పరిసర ప్రాంతాలతో సంబంధం ఉన్న రాజకీయ, ఉద్యోగ, రౌడీషీటర్లు నరుూం అనుచర గణంలో ఉన్నట్టు వెల్లడయ్యాయి. అదేవిధంగా మిర్యాలగూడ నుండి సుమారు నలుగురు చిన్న ఆడపిల్లలను నరుూంకు చేరవేసిన విషయాన్ని కూడ వారు అంగీకరించారని తెలిసింది. అనుముల మండలం హాలియాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పెద్దవూర మండలం ఏనేమీదతండాకు చెందిన మేరావతు మంగ భర్త దత్తుకు నాలుగు నెలల క్రితం జన్మించిన పసికందును 50,000 రూపాయలకు షఫీ, రమేష్ అనే ఆర్‌ఎంపి డాక్టర్ల ద్వారా కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. అదేవిధంగా 2012లో ఇతరుల పిల్లలను తమ పిల్లలుగా మిర్యాలగూడ మున్సిపాలిటీ జనన రిజిస్టర్‌లో తప్పుడు రిజిస్ట్రేషన్‌ను సయ్యద్ సాదిక్, ఫర్జానాలు చేశారని వెల్లడైంది. మరో ముస్లిం మహిళ ఆడపిల్లను కూడ కొనుగోలు చేసినట్టు వారు వెల్లడించినట్టు తెలిసింది. మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో విచారణ అనంతరం శుక్రవారంనిందితులు ముగ్గురిని స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.రాధాకృష్ణమూర్తి ముందు హాజరు పర్చారు. వారిని స్థానిక సబ్‌జైలుకు తరలించారు.

నరుూం కేసును సిబిఐకి అప్పగించాలి: విహెచ్

హైదరాబాద్, ఆగస్టు 19: ఉగ్రవాది నరుూం ఉదంతంలో నిందితులుగా ఉన్న వారిలో అనేక మంది పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు ఉన్నందున సిబిఐ విచారణ జరిపించాలని ఎఐసిసి నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉదంతాన్ని ‘సిట్’ చేతిలో పెట్టేసి చేతులు దులుపుకున్నదని ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ‘సిట్’పై ప్రజలకు నమ్మకం లేనందున, సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చినందున నగరంలోని హై-టెక్ సిటీకి రాజీవ్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.