రాష్ట్రీయం

అంటరానితనం, పేదరికంపై మరో క్విట్ ఇండియా ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: అంటరానితనం రూపుమాపేందుకు, పేదరికాన్ని నిర్మూలించేందుకు, మహిళలపై అత్యాచారాలు నిరోధించేందుకు రెండో క్విట్ ఇండియా ఉద్యమం రావాల్సి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం నగరంలోని ఒక హోటల్‌లో ‘స్వాతంత్య్ర సప్తతి, సాయం సంధ్య..’ పేరిట కవులు, కళాకారుల ఇష్టాగోష్ఠి జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అయితే నాడు ఆంగ్లేయులపై క్విట్ ఇండియా ఉద్యమం వచ్చిన తరహాలోనే నేడు క్విట్ అంటరానితనం, క్విట్ పేదరికం, క్విట్ వివక్ష, మహిళలపై అత్యాచారాలను క్విట్ చేయాల్సి ఉందని అన్నారు.
సమాజం కోసం జీవించాలని, మనుషుల పట్ల ప్రేమ ఉండాలని ఆయన తెలిపారు. స్వరాజ్యం సురాజ్యంగా మారాలని, అక్రమాలు లేకుండా రామరాజ్యం కావాలని గాంధీజీ, ఇతర మహానీయులంతా ఆకాంక్షించారని ఆయన చెప్పారు. గోమాతను, చెట్టును పూజించే, పాముకు పాలు పోసే సంస్కృతి మనదని అన్నారు. సాంఘిక దురాచారాల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్జల్ గురు వంటి వారు దేశ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు ప్రయత్నించారని ఆయన విమర్శించారు. అమెరికా అధ్యక్షునికి లేఖ రాయడం, వ్యాసాలతో సమాజంలో చీలిక తెచ్చే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కోరారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి వైఎస్ సుజనా చౌదరి ప్రసంగిస్తూ కుల, మతాలు లేకుండా అందరూ జరుపుకొనే పండుగ స్వాతంత్య్ర దినోత్సవమని అన్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న స్వాతంత్య్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి యువకులను పెద్ద ఎత్తున ఆహ్వానించి ఉంటే బాగుండేదని అన్నారు. సినీ నటుడు, ఎంపి మురళీ మోహన్ ప్రసంగిస్తూ దేశ పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఆకాంక్షించారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ప్రసంగిస్తూ తాను ఎన్నో సినిమాలు తీశాను కానీ గాంధీజీ సినిమా తీయలేకపోయానన్న బాధ కలిగిందని అన్నారు. అయితే ఎన్టీఆర్‌తో మేజర్ చంద్రకాంత్ సినిమా తీసినప్పుడు అందులో ‘పుణ్యభూమి నా దేశం’ పాటలో ఎందరో మహనీయులను చూపించానని ఆయన తెలిపారు.