రాష్ట్రీయం

మలుపు తిరిగిన ఎమ్సెట్-2 కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 19: ఎమ్సెట్-2 లీకేజి కేసు కొత్త మలుపు తిరిగింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, 50 వేల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన మెడికల్ ప్రవేశపరీక్ష లీకేజి కేసులో నిందితుడిని రక్షించడానికి ప్రయత్నించి సిఐడి డిఎస్పీ అడ్డంగా దొరికిపోయాడు. ఎమ్సెట్ -2 లీకేజి కేసులో దర్యాప్తు బృందంలో ఉన్న వరంగల్ జిల్లా సిఐడి డిఎస్పీ బాలు జాదవ్ ఈ కేసులో ఉన్న నిందితుడిని అరెస్టు చేయకుండా ఉండేందుకు ఒక లక్ష రూపాయల సొమ్ము అడిగినట్లు అభియోగాలు వచ్చాయి. ఈ కేసులో నిందితుడు గుమ్మడి వెంకటేష్ విజయవాడకు చెందిన వ్యక్తి. ఈ విషయమై దర్యాప్తు చేసిన డిజిపి సిఐడి డిఎస్పీ బాలు జాదవ్‌ను, సహకరించిన పోలీసు కానిస్టేబుల్ సదాశివరావును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులను డిజిపి ఆదేశించారు. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న డిఎస్పీ, కానిస్టేబుల్‌ను కూడా సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
మరో బ్రోకర్ ఢిల్లీలో అరెస్టు
ఎమ్సెట్-2 లీకేజి కేసులో ఢిల్లీకి చెందిన మరో బ్రోకర్‌ను సిఐడి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి పేరు అశ్వని కుమార్ అని సిఐడి ఐజి తెలిపారు. ఢిల్లీలో నిందితుడు ఆకృతి కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను రాజేంద్రప్లేస్ ఏరియాలో నిర్వహిస్తున్నాడని చెప్పారు. ఈ నిందితుడు ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేసి వారి పిల్లలను బెంగళూరుకు తీసుకెళ్లి రెండు సెట్ల మెడికల్ ప్రశ్నాపత్రాలను అందించాడు.