రాష్ట్రీయం

నకిలీ కరెన్సీ ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 22: ప్రకాశం జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లను చెలామణి చేస్తున్న ఎనిమిదిమంది ముఠా సభ్యులను మంగళవారం కందుకూరు పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్‌పి సిహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. మంగళవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన శంకర్ ఈ నకలీ కరెన్సీ నోట్ల చెలామణిలో ప్రధాన నిందితుడని, అతను పరారీలో ఉన్నట్లు తెలిపారు. విజయవాడలోని రాజరాజేశ్వరిపేటకు చెందిన కర్లకుంట ప్రసాద్, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చేరుమాను గ్రామానికి చెందిన కట్టా దావీదు, పొదిలి మండలం విశ్వనాధపురానికి చెందిన పాలకుర్తి శేషయ్య, వెలిగండ్లమండలం మరపగుంట్ల గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కనిగిరి మండలం కొత్తపేటకు చెందిన వెలుతుర్ల శ్రీనివాసరెడ్డి, పిసిపల్లి మండలం పెద్దఇర్లపాడు గ్రామానికి పోరు మనోహర్‌రెడ్డి, గుడ్లూరు మండలం దారకానిపాడుకి చెందిన బెజవాడరాజు, బెజవాడ ప్రవీణ్‌చౌదరి ఉన్నారన్నారు. 30వేల రూపాయల వెయ్యి రూపాయల నకలీ కరెన్సీనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన శంకర్ వెయ్యి రూపాయల కరెన్సీనోట్లను మిగిలిన రెండు నుండి తొమ్మిదిమంది నిందితులకు 70వేల రూపాయలకు అసలు కరెన్సీనోట్లకు ఒక లక్ష నకలీ కరెన్సీనోట్లను ఇస్తూ వాటిని వివిధ ప్రాంతాల్లో చెలామణి చేయిస్తున్నాడన్నారు. ఈక్రమంలో దావీదు ఈ నకలీ కరెన్సీనోట్లను మార్చమని నిందితులకు అప్పగించగా, వారు ప్రకాశం జిల్లా కందుకూరు, గుడ్లూరు, కనిగిరి ప్రాంతాల్లో మార్చుకునే సమయంలో వారినుండి 30వేల వెయ్యి రూపాయల నకిలీ కరెన్సీనోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డిఎస్‌పి స్థాయి ప్రత్యేకాధికారిని విచారణాధికారిగా నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించనున్నట్లు ఎస్‌పి తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న
నకిలీ 1000 రూపాయల నోట్లు