రాష్ట్రీయం

నరుూంకు ఆడశిశువు విక్రయం కేసులో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 20: పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్ నరుూంకు ఆడశిశువును విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను సిట్ అధికారులు, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సిట్ అధికారులు, వన్‌టౌన్ పోలీసులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నరుూం అత్త, సుల్తానా, మరో ఇద్దరిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం ఆడశిశువుల విక్రయం వెలుగు చూసింది. ఇందులో సహకరించిన ఇద్దరు ఆర్‌ఎంపి డాక్టర్లు రమేష్, షఫీ, అదేవిధంగా ఆడశిశువు తండ్రి మేరావత్ దత్తును అరెస్టు చేశారు. నాలుగు నెలల క్రితం అనుముల మండలం హాలియాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మేరావత్ మంగకు జన్మించిన ఆడశిశువును 50,000 రూపాయలకు ఆర్‌ఎంపిల ద్వారా నరుూం అత్త సుల్తానా కొనుగోలు చేసి నరుూంకు అప్పగించగా అతను షాద్‌నగర్‌లోని తన బంధువుల ఇంటి వద్ద పాపను ఉంచాడని విచారణలో తేలింది.
నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామానికి చెందిన షఫీ, త్రిపురారం మండలం కాపువారిగూడెం గ్రామానికి చెందిన రమేష్ పెద్దవూర మండలంలోని ఏనేమీద తండా, హాలియాలోని గ్రామాల్లో వైద్య సేవలందిస్తున్నారని పోలీసులు తెలిపారు. వారికి నరుూం అత్త పిల్లలు కావాలని చెప్పడంతో మధ్యవర్తులుగా వ్యవహరించి ఆడశిశువు తండ్రి దత్తుకు డబ్బు ముట్టజెప్పి శిశువును తీసుకెళ్లారని వన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్ డి.బిక్షపతి, సిట్ ఇన్స్‌పెక్టర్ సుధాకర్ తెలిపారు. నరుూం బంధువుల వద్ద ఉన్న ఆడశిశువును ఐసిడిఎస్ అధికారులకు షాద్‌నగర్ పోలీసులు అప్పగించినట్టు తెలిపారు. ఆడపిల్లల అక్రమ రవాణా, 370 ఎ, 370 క్లాజ్ 4 సెక్షన్‌ల కింద ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ముగ్గురిని స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.రాధాకృష్ణమూర్తి ముందు హాజరుపర్చగా జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. నరుూం కొనుగోలు చేసిన మరో ముగ్గురు ఆడపిల్లల విక్రయంపై సిట్, వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నరుూం బాధితులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు.