రాష్ట్రీయం

ఆందోళన కలిగిస్తున్న విపత్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ కాచిగూడ, ఆగస్టు 20: నగరాల్లో విపత్తులు క్రమంగా పెరిగిపోతున్నాయని సెంటర్ ఫర్ రిసోర్స్ ఎడ్యుకేషన్ (సిఆర్‌ఇ) డైరెక్టర్ డాక్టర్ బివి సుబ్బారావు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని దక్కన్ అకాడమి చంద్రంలో ‘్ఫరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ (ఎఫ్‌బిహెచ్) ఆధ్వర్యంలో ‘నగరాల్లో వరదలను ఎదుర్కొనే ప్యూహాలు- హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు చర్యలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ బివి సుబ్బారావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా నగరాల్లో వివిధ విపత్తులు అధికం అవుతున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో పాలకులు గ్రామాలు, కుటీర, చిన్నతరహా పరిశ్రమలు, చిన్న, సన్నకారు రైతులు అనే అంశాలపై మాత్రమే ప్రధానంగా దృష్టి సారించారని తెలిపారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి కూడా నగరంలో డ్రైనేజి వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శించారు. నగరాన్ని ఐటి హబ్‌గా తీర్చిదిద్దడానికి ముందే నగర వౌలిక వసతులపై కలిగే ప్రభావం, నగరానికి ఎంత మంది వచ్చే అవకాశం ఉందన్న తదితర అంశాలపై అధ్యయనం జరగాల్సి ఉండిందన్నారు. నగర మాస్టర్ ప్లాన్ అంశాలపై వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం దృష్టికి తీసుకుని వచ్చేందుకు ‘్ఫరమ్ ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. నిజాంకాలం నాటి వరద కాల్వలను సీవరేజ్ కాల్వలుగా మార్చిన ఘనత అధికారులకే దక్కిందన్నారు.
ఎఫ్‌బిహెచ్ అధ్యక్షుడు ఎం.వేదకుమార్ మాట్లాడుతూ పటిష్ఠమైన మాస్టర్ ప్లాన్ ఉంటే నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. రకరకాల మాస్టర్ ప్లాన్లకు బదులుగా ఒకే మాస్టర్ ప్లాన్ అమలయ్యేలా చేసేందుకు తమ సంస్థ కృషి చేసిందన్నారు. నగరం విస్తీర్ణం పెంచుకుంటూ పోతున్నారే కానీ వౌలిక వసతులను అదే స్థాయిలో పెంచలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌బిహెచ్ ఉపాధ్యక్షుడు ఎంహెచ్.రావు, కోశాధికారి డాక్టర్ రావు వివిజె చెలికాని, వి.ప్రకాశ్, రాంగోపాల్, నరహరి, సాబీర్, శేషగిరి, సత్యమూర్తి, రాణాప్రతాప్, ఇందిర పాల్గొన్నారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న సెంటర్ ఫర్ రిసోర్స్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ బివి సుబ్బారావు. చిత్రంలో ఎఫ్‌బిహెచ్ అధ్యక్షుడు వేదకుమార్ తదితరులు ఉన్నారు