రాష్ట్రీయం

డిఎస్పీ, సిఐల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, ఆగస్టు 20: పోలీసు ఉన్నతాధికారుల మామూళ్ల వేధింపులతో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న కుకునూరుపల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి కేసులో ఉన్నతాధికారులు ఎట్టకేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎస్పీ శ్రీ్ధర్, సిఐ వెంకటయ్య, కానిస్టేబుళ్లపై బదిలీ వేటు వేశారు. తనచావుకు కారకులుగా డిఎస్పీ శ్రీ్ధర్, సిఐలు వెంకటయ్య, రామాంజనేయులు, ఎఎస్‌ఐ ప్రకాష్, కానిస్టేబుళ్లు ముత్యం, సంధాని, నాగిరెడ్డి, యాదవరెడ్డిలపై సూసైడ్‌నోట్‌లో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎస్‌ఐ ఆత్మహత్య ఘటనపై 4రోజులుగా విచారణ జరుపుతున్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమైనాయి. దీనికితోడు విచారణ అధికారిగా వచ్చిన నిజామాబాద్ ఎఎస్పీ ప్రతాప్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎస్పీ శ్రీ్ధర్, సిఐలు వెంకటయ్య, రామాంజనేయులును, కానిస్టేబుళ్లను తప్పించేందుకు నామమాత్రంగా విచారణ చేపట్టారు. దీంతో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి భార్య ధనలక్ష్మి, కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనారు. హైకోర్టు సైతం ఈకేసును సుమోటోగా తీసుకొని సమగ్ర నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
శనివారం ఎస్‌ఐ భార్య ధనలక్ష్మి కుటుంబీకులు హోమంత్రి నాయిని నర్సింహారెడ్డిని ఆశ్రయించి సమగ్ర విచారణ చేసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిఐజి అకున్ సభర్వాల్ శనివారం కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి సూసైడ్‌నోట్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎఎస్‌ఐ ప్రకాష్, హెడ్‌కానిస్టేబుళ్లు ముత్యం, సంధాని, కానిస్టేబుళ్లు నాగిరెడ్డి, యాదవరెడ్డిలను, డిఎస్పీ శ్రీ్ధర్, సిఐలు వెంకటయ్య, రామాంజనేయులను విచారించారు. అనంతరం డిఎస్పీ శ్రీ్ధర్‌ను డిజిపి కార్యాలయానికి బదిలీచేసి రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చారు. సిఐలు వెంకటయ్య, రామాంజనేయులు, ఎఎస్‌ఐ ప్రకాష్, హెడ్‌కానిస్టేబుళ్లు ముత్యం, సంధాని, పిసి యాదవరెడ్డి, నాగిరెడ్డిలను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఎట్టకేలకు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎస్పీ, సిఐలు, కానిస్టేబుళ్లను బదిలీ చేశారు.