రాష్ట్రీయం

మంత్రాలయంలో మధ్యారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం, ఆగస్టు 20: మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యారాధన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూల బృందావనానికి పంచామృతాభిషేకం, రాయల పాదపూజ, నిర్మల్య విసర్జన పూజలు నిర్వహించారు. బంగారు కవచాన్ని మూల బృందావనానికి అలంకరింపజేసి కర్నాటక నుంచి తెచ్చిన ప్రత్యేక పూలతో పూజలు చేశారు.
పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు మూల బృందావనానికి ప్రత్యేక పూజలు, హారతులు ఇచ్చారు. తొలుత బృందావన ప్రతిమ, స్వామి రచించిన గ్రంథాలను బంగారు రథంలో ఉంచి ఊరేగించారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ లక్షలాది వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన కోలాటం, నృత్యాలు ఆలరించాయి. మధ్యారాధన వేడుకల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాఘవేంద్రస్వామికి శనివారం పట్టువస్త్రాలు సమర్పించారు.
పట్టువస్త్రాలు తీసుకువచ్చిన అర్చకులకు మఠం అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పట్టువస్త్రాలను మఠం పీఠాధిపతికి అందజేశారు. పూజాదికాల అనంతరం పట్టువస్త్రాలను బృందావనానికి అలంకరించారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరాయలను గజ వాహనంపై ఊరేగించారు.

చిత్రం.. అశేష జనవాహిని మధ్య మంత్రాలయంలో బంగారు రథంపై ప్రహ్లాదరాయలును ఊరేగిస్తున్న దృశ్యం