తెలంగాణ

నరుూం బంధువులను విచారిస్తున్న సిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, ఆగస్టు 21: గ్యాంగ్‌స్టర్ నరుూం బంధువులను సిట్ అధికారులు, మిర్యాలగూడ ఒన్‌టౌన్ పోలీసులు విచారణ కొనసాగిస్తునే ఉన్నారు. బంధువుల్లో ఇద్దరు తోడల్లుడు, అతని భార్యను విచారించగా వారి పేరిట నరుూం అత్తా ఈదులగూడలోని ఒక ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించినట్టు వెల్లడైంది. నరుూం అత్తా సుల్తానా తన వాంఙ్మలంలో చెప్పిన 20 మందిని ఇంకా విచారించేందుకు సిట్ అధికారితో పాటు, ఒన్‌టౌన్ ఇన్స్‌పెక్టర్ కూడ నల్లగొండ తదితర ప్రాంతాలకు వెళ్లారు. నరుూం అత్తా సుల్తానా చెప్పినట్టు నలుగురు ఆడశిశువులను కొనుగోలు చేసిన వ్యవహారంలో ఒక ఆడశిశువును విక్రయించిన తండ్రి దత్తు, ఆర్‌ఎంపి డాక్టర్లు షఫీ, రమేష్‌లను అరెస్టు చేయగా ఇంకా ముగ్గురు ఆడశిశువుల వివరాలు పోలీసులు సుల్తానా రాబట్టేందుకు యత్నించగా వారి వివరాలు లేవని ఆమె పేర్కొన్నట్టు తెలిసింది. మిర్యాలగూడలోనే ఒక 40 సంవత్సరాల వయస్సున్న మహిళ కవల ఆడపిల్లలను కనగా వారి వివరాలు తీసుకోవద్దని నరుూం అత్తాను ఆదేశించాడని, వారికి చెల్లింపులు చేసి పంపవలసిందిగా ఆదేశాలిచ్చాడని తెలిసింది. అదే విధంగా మరో ముస్లిం యువతి పెళ్లి కాకుండా గర్భవతి కాగా ఆమె కూడ ఆడపిల్లను ప్రసవించగా ఆ పిల్లను డబ్బుకు తీసుకున్నానని, వారికి డబ్బు ముట్ట చెప్పి వారి వివరాలు తీసుకోలేదని, వారు చెప్పలేదని ఆమె వాంఙ్మలంలో పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో వారి వివరాలు లేని కారణంగా వారి అరెస్టులు కూడ చేయలేకపోయినట్టు అధికారులు అంటున్నారు. అదే విధంగా నరుూం స్వంత తమ్ముడు ఫహీం మరణించిన అనంతరం అతని భార్య పర్హానా ఆమె ఆడ కూతురును కూడ బలవంతంగా తీసుకుని వెళ్లి తన డెన్‌లో ఉంచుకున్నాడని సుల్తానా పేర్కొన్నట్టు తెలిసింది. మొత్తం మీద ఇంకా 20 మంది బంధు, మిత్ర, అనుచర గణం కోసం సిట్, పోలీసు అధికారులు గాలిస్తునే ఉన్నారు.
‘మహా’ ఒప్పందంపై
విమర్శలు అనుచితం
ఎంపి సుఖేందర్‌రెడ్డి ఆవేదన
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఆగస్టు 21: మహారాష్టత్రో గోదావరి జలాల వినియోగంపై సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 23న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో చేసుకోనున్న ఒప్పందం చారిత్రాత్మకమైందని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహారాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం చేసుకోనున్న ఒప్పందంపై విపక్షాలు రాజకీయ కోణంలో అనుచిత విమర్శలు చేస్తున్నాయన్నారు. గతంలో కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాల్లో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలున్నా గోదావరి జలాల వినియోగానికి, ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు లేకుండా ఒప్పందాలు చేసుకోలేకపోయాయని విమర్శించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పేచీలు పెట్టుకోవడం కంటే ఒప్పందాలతో ప్రాజెక్టులు కట్టుకోవడం ద్వారా నదీ జలాల సద్వినియోగంలో ముందడుగు వేయడమే మంచిదన్నారు. మహారాష్ట్ర-తెలంగాణ మధ్య ఇంటర్ స్టేట్ బోర్డు ఏర్పాటు రెండు రాష్ట్రాల ప్రగతికి దోహదం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు గట్టి మేలు జరుగుతుందని, నల్లగొండ జిల్లాలోనే ఎస్సారెస్పీ రెండో దశలో రెండున్నర లక్షల ఎకరాలు, గంథమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల ద్వారా మరో రెండున్నర లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. తెలంగాణ ఎదుర్కొంటున్న కరవు వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణాలు ఎంతో అవసరమన్నారు. ఈ దఫా కూడా రాష్ట్రంతో పాటు నల్లగొండ జిల్లా కరవు పరిస్థితులను ఎదుర్కొంటోందని, వర్షాభావ పరిస్థితులపై సిఎం కెసిఆర్ ఆందోళనతో ఉన్నారన్నారు. నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద ఒక పంటకు నీరందించడం ద్వారా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరగా అందుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులు ఆదేశించారన్నారు. ఈ నెల 24న కృష్ణాబోర్డు భేటీ పిదప నీటి విడుదలపై నిర్ణయం వెలువడవచ్చన్నారు. అలాగే ఎఎమ్మార్పీ ద్వారా కూడా వీలైనంతవరకు సాగర్ నీటిని తీసుకుని మంచినీటి చెరువులు, కుంటలు నింపడం ద్వారా భూగర్భ జల పరిరక్షణకు కూడా చర్యలు తీసుకోవాలని సిఎంను కోరగా అవసరమైన చర్యలకు ఆదేశించారన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే కెసిఆర్ ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారని, నల్లగొండ జిల్లాలోనే మిర్యాలగూడ కొనసాగుతుందన్నారు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్ తదితరులు ఉన్నారు.