రాష్ట్రీయం

టిడిపి-బిజెపి మైండ్‌గేమ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ కలహాల కాపురంలో మైండ్‌గేమ్ మొదలయింది. ఇరుపక్షాలు ఒకరిని భ్రష్ఠు పట్టించేందుకు మరొకరు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రత్యేక హోదా అంశం వేదికగా జరుగుతున్న పోరు ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లూ ‘దేశం’ దాడి చేస్తున్నా వౌనంగా ఉంటున్న కమలదళాలు, ఇప్పుడు బాబు దుబారా, కేంద్రం ఇచ్చిన నిధుల గణాంకాలతో తెదేపాపై ఎదురుదాడి చేస్తుండటం కొత్త పరిణామం.
రాష్ట్రానికి కేంద్రం తాజాగా ఇచ్చిన 1972 కోట్ల వల్ల లాభమేమీలేదని, వాటితో కేబుళ్లు కూడా వేసుకోలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇచ్చిన ఆ నిధులు ప్యాకేజీనా, హోదాకు ప్రత్యామ్నాయమా అన్నది ఇంకా స్పష్టత రావలసి ఉందని, అయినా ముష్టితోనే సమానమని పార్టీ ఎంపీలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మంత్రులు కూడా హోదా ఇవ్వకపోతే ఎన్డీయే నుంచి బయటకు వస్తామని హెచ్చరిస్తున్నారు.
తాజాగా వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తు పెట్టుకోవాలా, వద్దా? అన్న అంశంపై ఇప్పటినుంచే తెదేపా నాయకత్వం జిల్లా పార్టీ అధ్యక్షులతో అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. బిజెపితో పొత్తువల్ల ఎస్సీలు, అందులో ఎక్కువ సంఖ్యలో ఉన్న మాల సామాజికవర్గం, ముస్లింలు దూరమవుతున్నారన్న భావన తెదేపాలో ఉంది. ఆ మేరకు చేయించిన సర్వేల్లో కూడా అదే తేలిందని చెబుతున్నారు. అది నిజమా కాదా? అన్నది రూఢీ చేసుకుని నివేదిక ఇచ్చే బాధ్యతను ఒక సీనియర్ మంత్రికి అప్పగించినట్లు తెలిసింది. ఆ రెండువర్గాలు కలిపి 27శాతం ఉన్నారని, ప్రధానంగా మాలలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, బిజెపితో కలసి ఉన్నందున ఆ వర్గం వైసీపీతో ఉందని, ముస్లింలు కూడా అదే భావనతో ఉన్నారన్న సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు మాలలు వైసీపీకి దన్నుగా ఉండగా, ఎన్నికల తర్వాత తెదేపా నాయకత్వం జూపూడి, కారెం శివాజీ వంటి మాల నేతలను పార్టీలోకి తీసుకుంది. తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో మాల నేతలను ఎక్కువ సంఖ్యలో చేర్చుకుంది. ఫలితంగా మాలలు తెదేపావైపు ఉంటారన్న అంచనా వ్యక్తమవుతోంది. అయితే, బిజెపితో కలసి ఉంటే మాల-ముస్లిం వర్గాలు తమకు దూరంగా ఉంటారని పలువురు జిల్లా అధ్యక్షులు మంత్రికి వివరించినట్లు సమాచారం.
హోదా ఇచ్చేందుకు సిద్ధంగాలేని బిజెపితో ఎక్కువకాలం కొనసాగడం రాజకీయంగా లాభం కాదన్న నిర్ణయానికి వచ్చిన తెదేపా, వీలైనంత మేరకు కేంద్రాన్ని కడుగుతోంది. ఎన్నికలకు ఏడాదికి ముందు బిజెపితో కటీఫ్ చెప్పాలన్నది తమ పార్టీ వ్యూహమని పార్టీ సీనియర్లు బాహాటంగానే చెబుతున్నారు. ఆలోగా ఆ పార్టీని అప్రతిష్ట పాలుచేసే మైండ్‌గేమ్ ఆడాలన్నదే లక్ష్యమంటున్నారు.
కాగా, చంద్రబాబు మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి, మోదీని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బహిరంగంగానే ఆరోపణాస్త్రాలు సంధించారు. సురేష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలకు పార్టీలో మద్దతు పెరుగుతోంది. తమ మనోభావాలు ఆయన ప్రతిబింబించారంటున్నారు.
దీనికి కొనసాగింపుగా చంద్రబాబు చేస్తున్న దుబారాను బిజెపి నేతలు బహిరంగంగానే చర్చ చేస్తుండం చూస్తే, ఇద్దరి మధ్య యుద్ధం మొదలయినట్లుగానే రాజకీయ పరిశీలకులు విశే్లషిస్తున్నారు. కాగా, మంగళవారం రాష్ట్ర పార్టీకి చెందిన 13 మంది సీనియర్లతో ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో హోదా అంశం, దానిపై తెదేపా చేస్తున్న విమర్శలు, రాష్ట్ర అధ్యక్షుడి వౌనం చర్చకు రానున్నట్లు సమాచారం.