రాష్ట్రీయం

వైభవంగా అతిరుద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, డిసెంబర్ 22: పంచారామ క్షేత్రం ద్రాక్షారామలో నిర్వహిస్తున్న అతిరుద్రం మహాయజ్ఞం మూడో రోజైన మంగళవారం వైభవంగా సాగింది. సంకల్పాలు నిత్యపారాయణలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, సూర్య నమస్కారాలు జరిగాయి. గౌరీశంకర కలశారాధనతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు గురువందనం, వేదపారాయణం, గురు ప్రార్ధన, మహాన్యాసం, రుద్రాభిషేకం, వసోర్ధార, మహామంగళ హారతి కార్యక్రమాలు జరిగాయి. మాతా శ్రీశ్రీశ్రీ విజయేశ్వరిదేవి అమ్మ, శాసనసభ్యులు తోట త్రిమూర్తులు, తూర్పు గోదావరి జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు పాల్గొన్నారు.

యజ్ఞంలో హోమద్రవ్యాలు వేస్తున్న మాతా విజయేశ్వరీదేవి