రాష్ట్రీయం

రోజాను పూర్తికాలం సస్పెండ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ పూర్తికాలం పాటు శాసనసభ్యురాలు రోజాను సస్పెండ్ చేయాలని, ఆమెపై కఠిన చర్యలు చేపట్టాలని టిడిపి ఎమ్మెల్యేలు మంగళవారం నాడు శాసనసభలో డిమాండ్ చేశారు. జీరో అవర్ కింద టిడిపి ఎమ్మెల్యేలు రోజా వ్యవహార సరళిపై ప్రస్తావన తెస్తూ, ఆమెపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదుచేయాలని, పూర్తికాలం సభ నుండి బషిష్కరించాలని, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరారు. సభలో ఉన్నంత సేపూ రన్నింగ్ కామెంట్రీ చేయడం, మంత్రులపైనా, సిఎంపైనా లేని పోని అభాండాలు వేయడం, దళిత మహిళా ఎమ్మెల్యేలపైనా ఆరోపణలు చేయడం అలావాటుగా మారిందని, గత శాసనసభ సమావేశాల్లో ఆమె చర్యలపై సస్పెండ్ చేసినా, తర్వాత దానిని ఎత్తివేశారని, అయినా ఆమె తీరులో మార్పు రాలేదని అన్నారు. అనిత మాట్లాడుతూ అసభ్య పదజాలంతో రోజా మాట్లాడుతున్నారని, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఆమె చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్నామనే భావనతో తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆమె వ్యవహరిస్తున్నారని అన్నారు.
గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. అనేక మంది నేతలు సభలకు వస్తుంటారని, అయితే రోజా మాట్లాడిన తీరు, భాష జుగుప్సాకరంగా ఉంటున్నాయని, బరితెగించి మాట్లాడుతున్నారని అన్నారు. రోజా ఎవరన్నా లెక్కలేదన్నట్టు వ్యవహరిస్తున్నారని ఆమె ప్రవర్తన అసహ్యకరంగా ఉందని ఆమెకు తిరిగి సభలో ప్రవేశించే అర్హత లేదని పేర్కొన్నారు. విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే అనితను నిందించిన విషయం తనకు తెలియదని, రోజాపై తీసుకునే ఎటువంటి చర్యకైనా తాము సంపూర్ణంగా మద్దతు ఇస్తామని చెప్పారు.
సుజాత మాట్లాడుతూ గతంలో కూడా ఆమె అనేకమార్లు అసభ్యంగా మాట్లాడారని చెప్పారు. గౌతు శ్యాం సుందర శివాజీ మాట్లాడుతూ స్పీకర్ ఇలాంటి సభ్యులపై కొరడా ఝులిపించాలని అన్నారు. కొండపల్లి అప్పలనాయుడు మాట్లాడుతూ రోజా మాటలు వినడానికే ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఎన్ ఆనందరావు మాట్లాడుతూ రోజా ఎప్పుడూ అసభ్యకర భాషను ఉపయోగిస్తుంటారని పేర్కొన్నారు. ఎం గీత మాట్లాడుతూ చట్టసభల్లో ఏ మాత్రం గౌరవం లేకుండా రోజా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జి లక్ష్మీదేవి, కిమిడి మృణాళిని, తంగిరాల సౌమ్య, జివి ఆంజనేయులు, కాగిత వెంకటరావు , యామిని బాల తదితరులు రోజా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకవాక్య తీర్మానంతో ఆమెను శాశ్వతంగా బహిష్కరించాలని కోరారు.
రోజా తీరుతెన్నులపై ఆడియో, వీడియో క్లిప్పింగ్‌లను తెప్పించుకున్నామని, వాటిని పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. రోజా తీరుపై ప్రతి ఒక్కరిలో ఆవేదన నెలకొని ఉందని, ప్రతిపక్షంలో సైతం ఒకరిద్దరు మినహా అందరిలో అదే అభిప్రాయం ఉందని స్పీకర్ చెప్పారు. తనను చూసి నీరసంగా ఉన్నారెందుకు అని అడుగుతున్నారని, అది మానసిక నీరసమేనని, శారీరక నీరసం కాదని చెప్పారు. గత సమాజంలో ఆమెపై చర్యలు తీసుకున్నతర్వాత పశ్చాత్తాపంతో తీరు మారుతుందని భావించామని, ఆమె తీరు పునరావృత్తం కాదని భావించామని స్పీకర్ అన్నారు. తమ బాధ్యతలను మరిచిపోయే ప్రసక్తే లేదని, సభా గౌరవం పలుచన కాకుండా చూస్తామని స్పీకర్ అన్నారు.