రాష్ట్రీయం

చైనా వైపు నైరుతి రుతుపవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 22: నైరుతి రుతుపవనాల వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటుండటంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. నైరుతి రుతుపవనాలు చైనా వైపు కదులుతుండటంతో, వాటి ప్రభావం రాష్ట్రంపై తగ్గుతోంది. నైరుతి రుతుపవానాల పరిస్థితిలో మార్పుల కారణంగా కొనే్నళ్ళుగా రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గడాన్ని వాతావరణ నిపుణులు గమనిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో కోస్తాంధ్ర, రాయలసీమలో సాధారణ వర్షపాతం కంటే 55, 80 శాతం మేరకు వరుసగా అధికంగా నమోదైంది. జూలై, ఆగస్టు నెలల్లో అప్పడప్పుడు కొన్ని చోట్ల భారీ వర్షం మినహా, చాలా కాలం పాటు వర్షం కురవని పరస్థితి నెలకొంది. జూలై ప్రారంభానికి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన మండలాల సంఖ్య 62 కాగా, ఆగస్టు 17 నాటికి వాటి సంఖ్య 281కి చేరడం గమనార్హం. గత ఏడాది కూడా జూన్‌లో చాలా జిల్లాల్లో 100 శాతం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యాయి. జూలై, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే 55 శాతం తక్కువ వర్షపాతం నమోదు అయింది. పలు మండలాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితి రైతులపై, భూగర్భ జలాలపై, మంచినీటి లభ్యత, ఆహార ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఇది ఆర్థిక, పర్యావరణంపై కూడా ప్రభావం చూపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం, వాయుగుండాలు దక్షిణంవైపు పయనించకపోవడంతో నైరుతి రుతుపవనాల కేంద్రకం మెల్లమెల్లగా ఇతర రాష్ట్రాల వైపు వెళ్తున్నట్టుగా అంచనా వేస్తున్నట్టు విశ్రాంత వాతావరణ శాస్త్ర నిపుణుడు రాళ్లపల్లి మురళీకృష్ణ సోమవారం తెలిపారు. దీనికి తోడు నైరుతి రుతుపవనాల ప్రవాహం చైనా వైపు వెళుతుండటంతో కూడా రాష్ట్రంపై రుతుపవనాల ప్రభావం తగ్గడానికి కారణమవుతోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కిందట బంగళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, 20 రోజల కిందట ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రంపై ఎటువంటి ప్రభావం చూపకపోగా, ఇతర రాష్ట్రాల్లో భారీ వర్షాన్ని ఇవ్వడం కూడా రుతుపవనాల కేంద్రకం ఇతర రాష్ట్రాల వైపు తరలిపోతుందన్న వాతావరణ శాస్త్ర నిపుణుల అంచనాలకు ఊతం ఇస్తోంది. ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడం గమనార్హం. రుతుపవనాల సమయంలో ప్రెషర్ బెల్ట్స్ పాడవటం, పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, కర్బన ఉద్గారాలు, సముద్ర మట్టాల పెరుగుదల, భూ వినియోగంలో మార్పులు, కాలుష్యం వంటివి రుతుపవనాలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాగా సెప్టెంబర్‌లో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని మురళీకృష్ణ తెలిపారు.