రాష్ట్రీయం

స్పీకర్ నిర్ణయాలను సమీక్షించొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: తెలంగాణ శాసనసభ సెక్రటేరియట్ మార్చి 10వ తేదీన ఇచ్చిన బులెటిన్‌ను ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. పార్టీ వీడిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ రేవంత్‌రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టిడిపిఎల్పీని టిఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయడాన్ని ఆయన సవాలు చేశారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండానే విలీనం చేయడాన్ని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అయితే ఆయన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు తీర్పును రిజర్వులో ఉంచారు. షెడ్యూలు 10లో ఉన్న అధికారాల ప్రకారం ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ కేవలం అనర్హత అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, పార్టీని విలీనం చేసే విధంగా నిర్ణయం తీసుకునే హక్కు లేదని రేవంత్ వాదించారు. తెలంగాణ అడ్వకేట్ జనరల్ కె రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ శాసనసభ కార్యదర్శి తరఫున తాను కోర్టు ముందు హాజరైనట్టు చెప్పారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కేవలం ఉద్యోగిగా న్యాయస్థానం ముందు సమాచారం ఉంచినట్టు శాసనసభ కార్యదర్శి పేర్కొన్నారని, అలాంటపుడు కేసు యోగ్యతపై కార్యదర్శి తరఫున ఎజి ఎలా వాదిస్తారని ప్రశ్నించారు. అయితే అడ్వకేట్ జనరల్‌గా ప్రభుత్వం తరఫున ఈ కేసులో వాదించేందుకు తనకు హక్కు ఉందని పేర్కొనడంతో ఉభయ పక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. గొంతు పెంచిన ఎజి ఈ కేసులో తనను నిలువరించరాదని, తనకు ఉన్న పూర్తి హక్కుతోనే వాదిస్తున్నానని అన్నారు. దాంతో గొంతు పెంచవద్దని, కార్యదర్శి తరఫున ఎజి వాదించవచ్చని, కాని స్పీకర్ తరఫున కోర్టు ముందు హాజరుకావడానికి లేదని న్యాయమూర్తి ఆదేశించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 177 కింద తనకు స్పీకర్ తరఫున ఈ కేసులో హాజరయ్యే అవకాశం ఉందని ఎజి వాదించారు. గతంలోనూ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై డివిజన్ బెంచ్ తీర్పు చెప్పిందని, ప్రస్తుతం ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని ఎజి అన్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయసమీక్షకు అవకాశం లేదని ఎజి పేర్కొనగా, అలాంటిదేమీ లేదని స్పీకర్ నిర్ణయాలపై సైతం న్యాయసమీక్షకు వీలుందని ఈమేరకు గతంలో సుప్రీంకోర్టు సైతం అనేక తీర్పులు వెలువరించిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయిస్తూ మాత్రమే బులెటిన్ ఇచ్చారని ఎజి వివరించారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది చేసిన వాదనలను ఎజి తిప్పికొట్టారు. స్పీకర్ ముందు ఎలాంటి పిటిషన్లు పెండింగ్‌లో లేవని వివరించారు. ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేల తరఫున తాను హాజరయ్యానని, మరింత వాదనలు వినిపించేందుకు రెండు రోజులు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ న్యాయమూర్తిని కోరారు. రెండు రోజులు గడువు ఇవ్వలేమని, మధ్యాహ్నం 2.30 గంటలకు వచ్చి వాదనలు వినిపించాలని న్యాయమూర్తి పేర్కొన్నా ఆ సమయానికి ఎజి న్యాయస్థానానికి హాజరుకాలేదు.