ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ తర్వాత ప్రక్షాళన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: శాసనసభ సమావేశాల తర్వాత ఏపి మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తోంది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా పనితీరు ప్రదర్శించడంలో విఫలమైన కొందరు మంత్రులపై వేటు తప్పదన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీకి చెక్ చెప్పేందుకు రెడ్డి సామాజికవర్గానికి ఈసారైనా తగిన ప్రాధాన్యం దక్కుతుందా అన్న చర్చ జరుగుతోంది.
సెప్టెంబర్ 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 20మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరడం, వారిలో ఇద్దరు, ముగ్గురికి మంత్రి పదవులు హామీ ఇవ్వడం, పార్టీ సీనియర్లకు ఈసారి న్యాయం చేయాలని భావించిన బాబు, అసెంబ్లీ సమావేశాల తరువాత విస్తరణకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలిసింది.
బాబు గత కొద్దినెలల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేయించి, రేటింగులు ఇస్తున్నారు. రేటింగ్‌లు సరిగా రాని మంత్రులపై వేటుపడే అవకాశం ఉందంటున్నారు. మంత్రివర్గంలోకి బాబు తనయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ మేరకు బాబు కూడా ఈపాటికే సీనియర్ల వద్ద అభిప్రాయసేకరణ చేశారు. స్వయంగా లోకేష్ సైతం కొందరు సీనియర్లతో చర్చలు జరిపారు. వారంతా ఆయన విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉన్నారు.
నిజానికి లోకేష్ రాజకీయ అరంగేట్రం నుంచి మంత్రి పదవి వరకూ అంతా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతోంది. లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఒక నెలరోజులపాటు ఎమ్మెల్యే, ఎంపి, ఎమ్మెల్సీ, పార్టీ నేతలు, మంత్రులు ప్రకటనల ఉద్యమం చేశారు. లోకేష్ కూడా పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తూ, తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అయితే, ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా? లేక ఎవరితోనయినా రాజీనామా చేయించి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
రావెల కిశోర్, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, మృణాళిని, పుల్లారావు వంటి మంత్రుల స్థానాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరిలో ఒక మంత్రి భార్య జిల్లాలో పెత్తనం చేస్తుండగా, మరొక మంత్రికి కులం కోణంలో తొలి అవకాశం ఇచ్చినా ఆయన వల్ల ఆ కులం నుంచి ఎలాంటి ప్రయోజనం కలగలేదన్న భావన నాయకత్వంలో ఉంది. ఈ మంత్రి తరచూ తనకు లోకేష్ దన్ను ఉందన్న ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆ సామాజికవర్గం నుంచి మరొకరిని ఎంపిక చేయవచ్చంటున్నారు. మృణాళిని స్థానంలో ఆమె బావ, పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు అవకాశం దక్కవచ్చంటున్నారు. శిద్దారాఘవరావు జిల్లాలో వర్గాలను సమన్వయం చేయలేకపోతున్నారన్న విమర్శలు చాలాకాలం నుంచి ఉన్నాయి. ఆయనను తొలగిస్తే, వైశ్యవర్గానికే చెందిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్యకు అవకాశం దక్కవచ్చంటున్నారు.
రావెల స్థానంలో చాలామంది దళితులు పోటీపడుతున్నారు. రావెల స్థానంలో మాల మహిళా ఎమ్మెల్యేకు అవకాశం లభించవచ్చంటున్నారు. రావెల పనితీరుపై దళితుల్లో కూడా సంతృప్తి కనిపించడం లేదన్న సమాచారం పార్టీ వద్ద ఉందంటున్నారు.
ఆయన ఇంచార్జిగా ఉన్న ప్రకాశంలో పార్టీ నేతలు రోడ్డెక్కినా వారిని నియంత్రించడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. పుల్లారావు కుటుంబసభ్యులపై వస్తున్న ఆరోపణలు చాలాకాలం క్రితమే సీఎం దృష్టికి వెళ్లాయి. ఒకవేళ ఆయనను తొలగిస్తే అదే సామాజికవర్గానికి చెందిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు అవకాశం దక్కవచ్చు.
అనంతపురంలో వైసీపీ నుంచి వచ్చిన చాంద్‌పాషా, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ల మధ్య పోటీ కనిపిస్తోంది. ఒకవేళ చాంద్‌పాషాను తీసుకుంటే విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఆశలకు గండిపడినట్లే. అదే సమయంలో పయ్యావులకు స్థానం కల్పించాలనుకుంటే పరిటాలను తప్పించాల్సి ఉంటుంది. మంత్రి నారాయణ, గంటా శ్రీనివాసరావు శాఖలను మార్పు చేస్తారని, అచ్చెన్నాయుడుకు ప్రమోషన్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యం దృష్ట్యా ఆయన స్థానంపైనా చర్చ జరుగుతోంది.
కాగా, రెడ్డి సామాజికవర్గానికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ప్రచారానికి ఈసారి తెరదించుతారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, వైసీపీ నుంచి వచ్చిన భూమా నాగిరెడ్డి లేదా కూతురు అఖిలప్రియారెడ్డిలో ఎవరికి అవకాశం దక్కుతుందన్న చర్చ మొదలయింది.
కాపుల నుంచి జ్యోతుల నెహ్రు, విజయనగరం నుంచి వెలమ వర్గానికి చెందిన సుజయకృష్ణ రంగారావుకు అవకాశం దక్కవచ్చంటున్నారు. వారిద్దరికీ బాబు హామీ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. యాదవ వర్గం నుంచి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కమ్మ వర్గం నుంచి బుచ్చయ్యచౌదరి పేర్లపైనా చర్చ జరుగుతోంది.