రాష్ట్రీయం

సుల్తాన్‌బజార్ ట్రేడర్లకు పునరావాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: హైదరాబాద్ మెట్రోరైలు పనులు మరో అడుగు ముందుకు పడ్డాయి. సికిందరాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఆర్టీసి క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, సుల్తాన్‌బజార్‌ల మీదుగా నిర్మించనున్న కారిడార్‌లో భాగంగా సుల్తాన్‌బజార్‌లో అలైన్‌మెంట్ మార్చాలంటూ డిమాండ్లు విన్పించిన సంగతి తెలిసిందే. ఎలాంటి మార్పుల్లేకుండా ముందుగా ప్రతిపాదించిన పాత రూట్‌లోనే మెట్రోరైలు పరుగులు తీస్తుందని సర్కారు, ఎల్ అండ్ టి అధికారులు చేసిన ప్రకటన మేరకు మంగళవారం పనులు మరింత ఊపందుకున్నాయి. కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీ ముందున్న పెట్రోల్ బంక్‌వెనుక మెట్రో అధికారులు సుల్తాన్‌బజార్ వ్యాపారస్తులకు ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించేందుకు జి ప్లస్ నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి కావాల్సిన పార్కింగ్ స్థలం కోసం సుమారు 1370 గజాల పెట్రోల్ బంక్ స్థలాన్ని మంగళవారం మెట్రో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలానికి సంబంధించి కోర్టులో కేసు ఉండగా, మంగళవారం కోర్టు ఇచ్చిన తీర్పుమేరకు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. కొత్తగా నిర్మించిన ఈ నాలుగు అంతస్తుల భవంలో మెట్రో రైలుస్టేషన్‌తో పాటు సుల్తాన్‌బజార్ వ్యాపారులకు పునరావాసాన్ని కల్పించనున్నట్టు చెప్పారు. ఇందుకు రూ. 15.22 కోట్లను నష్టపరిహారంగా చెల్లించినట్టు కూడా అధికారులు తెలిపారు. మొత్తం 2వేల చదరపు గజాల విస్తీర్ణంలో 70వేల చదరపు అడుగల ఏరియాతో ఈ భవనాన్ని నిర్మించినట్టు తెలిపారు. రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్, పై నాలుగు అంతస్తుల్లో 80 మంది వ్యాపారులకు పునరావాసం కల్పించనున్నట్టు చెప్పారు. ఈ భవనాన్ని అరుదైన డిజైనింగ్‌లో నిర్మించేందుకు గతంలో మెట్రో అధికారులు ప్రపంచ వ్యాప్తంగా ఆర్కిటెక్చర్లకు డిజైన్ల పోటీలను నిర్వహించి, అందులో ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసినట్టు తెలిపారు.

కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీ
ముందున్న పెట్రోల్ బంకు స్థలంలో
నిర్మాణాలను తొలగిస్తున్న దృశ్యం