తెలంగాణ

తెలంగాణకు తీరని అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, ఆగస్టు 23: తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న సాగునీటి ఒప్పందం యావత్తు తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసేదిగా ఉందని ఎమ్మెల్యే డికె అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు జరుపుతున్న సాగునీటి ఒప్పందాలను నిరసిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం చేసుకుంటున్న ఒప్పందాలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసినవేనని అన్నారు. పాత ఒప్పందాలను కొత్త ఒప్పందాలుగా చేస్తూ ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఉందని ఆమె విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆమలు చేస్తున్న సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ హయంలోనే రూపకల్పన చేసినవని ఆమె పెర్కోన్నారు. ప్రస్తుతం వాటి పేర్లను మార్చి ప్రభుత్వం కొత్త పేర్లతో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్లుగా చెప్పుకుంటుందని ఆమె అన్నారు.

కలెక్టరేట్ ముందు బైటాయించి ధర్నా చేస్తున్న గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ, కాంగ్రెస్ నేతలు