తెలంగాణ

చారిత్రాత్మకం కాదు.. శాశ్వత ద్రోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: ‘మహా’ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో, రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పలు ప్రాజెక్టులపై ఒప్పం దం చేసుకుంటున్న సమయంలోనే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమి టీ నాయకులు, కార్యకర్తలు ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి, నల్ల జెండాలు చేతబూని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతరం వారు జిల్లా కలెక్టర్లను కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వినతి పత్రాలు అందజేశారు. టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి, జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ మహారాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం చారిత్రాత్మక ఒప్పందం కాదని, ఇది తెలంగాణకు శాశ్వతంగా ద్రోహం చేసే ఒప్పందం అవుతుందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరు వస్తుందన్న భావనతో, రీ-డిజైన్ పేరిట కుట్ర చేసిందని ఆయన విమర్శించారు. మహారాష్టత్రో చేసుకున్న ఒప్పందంతో తెలంగాణకు ఏ రకంగానూ న్యాయం జరగదని ఆయన తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ గతంలోనే గోదావరి నదీ జలాల ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ప్రాణహిత ప్రాజెక్టులో తమ్మిడిహెట్టి వద్ద గతంలో మాదిరిగా కాకుండా 152 నుంచి 148 మీటర్లకు ఎత్తు తగ్గించి తెలంగాణకు అన్యా యం చేస్తూ సంబరాలు చేసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఈ సమావేశంలో సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపిలు వి. హనుమంత రావు, అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
chitram...
మహా ఒప్పందానికి నిరసనగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ