తెలంగాణ

రుజువు చేస్తే రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్ట్ర ఒప్పందంతో గోసలు తీరుతాయని జనం ఆనందంతో సంబురాలు చేస్తుంటే, కాంగ్రెస్ సన్నాసులకు నల్ల జెండాలు కనబడుతున్నాయి. తెలంగాణ పచ్చబడుతుంటే చూడలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. కాంగ్రెస్ తన ఆరోపణలు రుజువుచేస్తే నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇస్తా. రాజకీయ సన్యాసం స్వీకరిస్తా’

హైదరాబాద్, ఆగస్టు 24: ‘తమ్మడిహట్టి బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్టత్రో గతంలో కాంగ్రెస్సే ఒప్పందం కుదుర్చుకున్నట్టు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అండ్ కో ఆరోపిస్తోంది. ఆ ఒప్పంద కాగితాలుంటే తీసుకొచ్చి చూపించండి. ఇక్కడే (బేగంపేటలో) అరగంట ఉంటా. రుజువుచేస్తే ఇటునుంచి ఇటే రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ ఇస్తా. రాజకీయ సన్యాసం స్వీకరిస్తా’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు సవాల్ విసిరారు. గోదావరి ప్రాజెక్టులపై మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకుని బుధవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సిఎంకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, రైతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంలో ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన సిఎం కెసిఆర్, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ప్రజలకు మంచి చేయడాన్ని చూసి ఓర్వలేని కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తూ తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నానా యాగీ చేసిందని, తమ్మడిహట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తుపై ఉత్తమ్ అండ్ కో తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ‘మహారాష్ట్ర ఒప్పందంతో గోసలు తీరుతాయని జనం ఆనందంతో సంబురాలు చేస్తుంటే, కాంగ్రెస్ సన్నాసులకు నల్ల జెండాలు కనబడుతున్నాయి. తెలంగాణ పచ్చబడుతుంటే చూడలేక కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు’ అని సిఎం దుయ్యబట్టారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక అవినీతిరహిత పాలన సాగుతుందని ప్రజలు హర్షిస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రధాని కూడా ప్రశంసించారు. దీన్ని చూసి ఓర్వలేక ప్రాజెక్టుల అంచనా పెరిగిందంటూ కనీస జ్ఞానం లేకుండా కాంగ్రెస్ సన్నాసులు ఆరోపణలకు దిగుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎరేమన్నా రెండేళ్లుగా వౌనం పాటించా. పెద్ద మనిషిగా మర్యాదగా ఉందామనుకున్నా. కానీ కాంగ్రెస్, తెదేపా కంపెనీలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాగే ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఇక ఎంతమాత్రం సహించం. ఆరోపణలు రుజువు చేయాలి. లేకపోతే కేసులు పెడతాం. జైలు కూడు తినాలి తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరించారు. ‘వర్షాలు పడక పంటలు ఎండిపోతుంటే రైతులు మొగులు (ఆకాశం) వైపు ఆశగా చూస్తుంటే... గుండెలు తరుక్కుపోతున్నాయి. ఈ పరిస్థితి పోవాలని వర్షాలు పడినా పడకున్నా తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి కోటి ఎకరాలకు నీరందించేందుకు జరుగుతున్న భగీరథ ప్రయత్నానికి జనం సంతోషపడుతుంటే, కాంగ్రెసోళ్ళ కళ్లకు నల్ల జెండాలు కనిపిస్తున్నాయి’ అని ధ్వజమెత్తారు. ‘ఆరు నూరైనా సరే కాళేశ్వరం నీళ్లతో ఉత్తర తెలంగాణ రైతుల పాదాలు కడుగుతాం. 2018నాటికి రెండు పంటలు పండించి చూపిస్తాం’ అని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. ‘తెరాస ప్రభుత్వం నిప్పులా పని చేస్తుంది. వాస్తవాలు ప్రజలకు తెలియజేయడానికి రెండు మూడు రోజుల్లో టీవీల్లో ముఖాముఖిగా మాట్లాడుతా. త్వరలో రాష్టమ్రంతా బస్సుయాత్ర నిర్వహించి కాంగ్రెస్ బండారం బయట పెడుతా’నని కెసిఆర్ హెచ్చరించారు. ‘కిరికిరి చేసి కెసిఆర్‌ను, ప్రభుత్వ ఏకాగ్రతను దెబ్బతీయలేరు. ఈ కెసిఆర్ జగమొండి. ఏదైనా పట్టుబడితే సాధించి తీరడమే తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు’ అన్నారు. గోదావరిలో 1480 టిఎంసి నికర జలాలున్నాయి. వీటిలో 950 టిఎంసి తెలంగాణకు కేటాయించబడ్డాయి. ఇవేకాకుండా మరో 3వేల టిఎంసి మిగులు జలాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో తెలంగాణ వాటా ఎంతో తేల్చండని త్వరలోనే మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఎంపీల బృందాన్ని ప్రధాని వద్దకు పంపుతామన్నారు. కేటాయించిన వాటిలోనే కాకుండా మిగులు జలాల్లో వాటాలు తేలితే అదనంగా మరో 50, 60 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాంగ్రెస్, తెదేపా, భాజపాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోటి ఎకరాలకు సాగునీరు అందించి ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కరిస్తామని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్టత్రో ఒప్పందానికి విశేషంగా కృషి చేసిన మంత్రి హరీశ్‌రావు సహా ఇంజనీరింగ్ అధికారులను సిఎం ప్రత్యేకంగా అభినందించారు.