తెలంగాణ

కెసిఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: తమ్మడిహెట్టి ఎత్తు విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని టిపిసిసి అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ‘మహా’ ఒప్పందం కుట్రను గురువారం బహిర్గతం చేస్తానని అన్నారు. తక్కువ ఎత్తుకు ఒప్పందం చేసుకుని పైగా చారిత్రాత్మకం అంటూ సంబరాలు చేసుకుంటారా? అని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో ఒప్పందం చేసుకున్న తర్వాత బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగిస్తూ తమ్మిడిహెట్టి ఎత్తు విషయంలో ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. దీంతో ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాత్రి 7 గంటలకు తన నివాసంలో అత్యవసరంగా విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, సిఎం సవాల్‌ను స్వీకరిస్తున్నానన్నారు. తమ్మిడిహట్టి ఎత్తు 152మీటర్లు ఉండాలని నీటి పారుదల రంగ నిపుణులు చెప్పారని ఆయన తెలిపారు. తన బహిరంగ లేఖతో పాటు నిపుణుల నివేదికనూ పంపిస్తానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ విధంగా ఒప్పందం చేసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. ఎత్తు తగ్గించి ఒప్పందం చేసుకోవడం ద్వారా భావితరాలకు భారీగా నష్టం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోటి ఎకరాలకు నీరు అందిస్తామని కాకి లెక్కలు చెబుతున్నారన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇది ప్రజల డబ్బు, సొంత ఆస్తి కాదు అని ఆయన విమర్శించారు. దేశంలో ఎక్కడా ఇలాంటి స్థాయిలో ఖర్చు పెట్టలేదని అన్నారు.
సైన్యంలో పనిచేశా, బెదరను..
ప్రాణహితకు జాతీయ హోదా లభించే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ప్రతిపక్షాన్ని అణిచి వేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తాను సైన్యంలో కెప్టెన్‌గా పని చేశానని, బెదిరింపులకు భయపడనన్నారు. ముఖ్యమంత్రి అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆయన విమర్శించారు. మహారాష్టల్రో ఒక్క ఎకరం కూడా మునగకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త తీసుకున్నదని ఆయన తెలిపారు. గ్లోబల్ టెండర్లకు ఎందుకు వెళ్ళలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు.