తెలంగాణ

తొమ్మిది మంది అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నరుూంపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తొమ్మిది మంది అదృశ్యమైనట్టు నరుూం సోదరి ఫర్హానా సిట్ విచారణలో అంగీకరించింది. కాగా ఇటీవల నార్సింగ్ పరిధిలోని మంచిరేవులలో నరుూం ఇంటి పనిమనిషి నస్రీన్ అస్తిపంజరాన్ని కనుగొన్న పోలీసులు మరో నలుగురిని గుర్తించినట్టు సిట్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ నలుగురి మృతదేహాలు ఎక్కడ పాతి పెట్టారన్న దానిపై ఆరా తీస్తున్నారు. నరుూంకు ముఖ్య అనుచరుడైన శేషన్నతోపాటు మరో ముగ్గురు దొరికితే మిగతా వారి మృతదేహాల (అస్తిపంజరాలు) ఆచూకీ లభిస్తుందని సిట్ అధికారి ఒకరు తెలిపారు. నరుూం ఇంట్లో అదృశ్యమైన వారిలో నరుూం పెద్దమ్మ కూతురు ఫహీదా, మతీన్, మరో అనుచరుడు అలీం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. నరుూం కేసులో ఇప్పటి వరకు 42కేసులు నమోదు చేసి, 44 మందిని అరెస్టు చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. నరుూం ముఠా సభ్యుల్లోని కీలక వ్యక్తి శేషన్న దొరికితే అందరి సమాచారం బయటపడుతుందని సిట్ భావిస్తోంది. నరుూం ఆగడాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. సిట్ అధికారులకు కీలకమైన ఆధారాలు లభిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో మరో నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. కాగా నరుూం వాడిన దాదాపు 200 సిమ్ కార్డులపై దర్యాప్తు కొనసాగుతోంది.
సిమ్ కార్డులు నరుూం బంధువులు, అనుచరుల పేర్లపై ఉన్నట్టు సిట్ గుర్తించింది. ఇప్పటి వరకు నరుూం 44 మంది అనుచరుల్లో 16 మంది సిమ్ కార్డులను మాత్రమే గుర్తించినట్టు తెలుస్తోంది. నరుూంకు సిమ్ కార్డులు అందించిన వారెవరు అన్న దానిపై సిట్ ఆరా తీస్తోంది.
సినీ రంగానికి చెందిన ప్రముఖులను విచారించాలన్న వట్టికుమార్ వ్యాఖ్యలను నిర్మాతల మండలి ఖండించింది. గ్యాంగ్‌స్టర్ నరుూంతో తమకు ఎలాంటి సంబంధం లేదని నిర్మాతల మండలి స్పష్టం చేసింది. నిర్మాత వట్టికుమార్ వ్యాఖ్యలు నిరాధారమైనవని, అతని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, సినీ ప్రముఖులకు నరుూంతో ఎలాంటి లావాదేవీలు, సంబంధాలు లేవని నిర్మాతల మండలి స్పష్టం చేసింది.