ఆంధ్రప్రదేశ్‌

హెలీ టూరిజానికి సైసై..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 24: విశాఖ జిల్లా గిరిజన ప్రాంతం, అరకు, విశాఖ నగర అందాలను హెలికాప్టర్ ద్వారా వీక్షించే అవకాశం దసరా నుంచి అందుబాటులోకి రానుంది. చాలా కాలంగా ఊరిస్తున్న ఈ ప్రతిపాదన త్వరలో కార్యరూపం దాల్చనుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా), స్కై చాపర్స్ లాజిస్టిక్స్ సంస్థ బుధవారం విశాఖలో ఒప్పందం చేసుకున్నాయి. విశాఖ నగరం, అరకుకు వేర్వేరుగా హెలికాప్టర్ సర్వీసులను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ధరలను, ఇతర అంశాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ విశాఖ చరిత్రలో ఇదో సువర్ణ్ధ్యాయమన్నారు. ఎన్నో ఏళ్లగా ఉన్న ప్రతిపాదన కార్యరూపం దాల్చిందన్నారు. అందమైన విశాఖ నగరం, గిరిజన ప్రాంత అందాలను విహంగ వీక్షణకు వీలుగా హెలిపాడ్‌ను వుడా పార్క్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు రెండు ఎకరాల స్థలాన్ని నెలకు 50 వేల రూపాయల అద్దె చొప్పున లీజ్‌కు ఇస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ నగరంలోని కైలాసగిరి, పోర్టు, స్టీల్ ప్లాంట్, ఎర్రమట్టి దిబ్బలు, బీచ్‌లను, అరకు ప్యాకేజీలో అరకు, లంబసింగి, బొర్రాగుహలు తదితర ప్రాంతాలను వీక్షించవచ్చన్నారు. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ అరకు ఉత్సవాన్ని నిర్వహించనున్నామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. భీమిలి, విశాఖ ఉత్సవాలను కూడా నిర్వహిస్తామన్నారు. పర్యాటకాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పర్యాటకాభివృద్ధి చర్యల్లో భాగంగా కోస్టల్ కారిడార్ పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో 100 కోట్ల రూపాయలతో 14 బీచ్‌లను అభివృద్ధి చేయన్నుట్లు తెలిపారు. దీనికి నివేదికను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ట్రైబల్ సర్క్యూట్ పేరుతో అరకు, లంబసింగి ప్రాంతాలను 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

ఒప్పంద పత్రాలు పరస్పరం అందజేత