తెలంగాణ

తెలంగాణ సచివాలయంలో ఉద్యోగుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ సచివాలయం ‘డి’బ్లాక్‌లో ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. సాంఘిక సంక్షేమ శాఖలో ఎస్సీ డెవలప్‌మెంట్ సెక్రటరీగా ఉన్న శ్రీనివాసరావు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నిరశన వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఉద్యోగులకు సెలవులు ఇవ్వకుండా పెత్తనం చెలాయిస్తున్నారని, సెలవులు అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఉద్యోగులు తెలిపారు. దీనిపై గతంలో ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మకు ఫిర్యాదు చేశామని, అయినా తమకు న్యాయం జరగలేదని ఉద్యోగులు వాపోయారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు రెండు గంటలపాటు సచివాలయంలోని అన్ని బ్లాక్‌లు తిరుగుతూ ఎస్సీ డెవలప్‌మెంట్ కార్యదర్శి శ్రీనివాసరావు వైఖరిపట్ల నిరశన వ్యక్తం చేశారు. ఇదివరకు ఆర్థిక శాఖలో ఉన్న అధికారి ఒకరు వేధిస్తే.. ఆందోళన చేశామని, ఇప్పుడు శ్రీనివాసరావును తొలగించే వరకూ తాము ఆందోళన కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ విషయమై శ్రీనివాసరావు స్పందిస్తూ తన పరిధిలో ఓ అధికారిగా తన విధులు సక్రమంగానే నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశారు.