తెలంగాణ

డిపిఆర్‌లను త్వరగా పూర్తిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు డిపిఆర్‌లను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అందజేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో మంజూరైన నూతన రహదారుల విషయమై మంత్రి తుమ్మల బుధవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇంజనీర్-ఇన్-చీఫ్‌లు గణపతిరెడ్డి, రవీందర్ రావులతో సమీక్షించారు. 1) నూతనంగా కేంద్ర ప్రభుత్వం అనుమతించిన జాతీయ రహదారులలో ముఖ్యమైన రహదారులు సంగారెడ్డి (ఎన్‌హెచ్-161)-నర్సాపూర్-తూప్రాన్- గజ్వేల్- జగదేవ్‌పూర్-్భవనగిరి-చౌటుప్పల్ (ఎన్‌హెచ్-65)-140 కి.మీలు, 2) చౌటుప్పల్ (ఎన్‌హెచ్-65)-ఇబ్రహీంపట్నం-ఆమన్‌గల్-షాద్‌నగర్-చేవెళ్ళ- శంకర్‌పల్లి-కంది (ఎన్‌హెచ్-65) - 160 కి.మీల విషయమై వారు చర్చించారు. ఈ రహదారిని హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్డుగా అభివృద్ధి పరచాలని, గ్రోత్ కారిడార్‌గా తీర్చి దిద్దే విధంగా ప్రణాళిక తయారు చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఈ రహదారి హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
గతంలో భారత ప్రభుత్వం పిసియుల ఆధారంగా అనుమతించిన రెండు వరుసల జాతీయ రహదారులను నాలుగు వరుసల రహదారులుగా మార్చే డిపిఆర్‌లను త్వరితగతిన పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకు తగు పరిపాలనా అనుమతులను త్వరగా పొందేలా చూడాలని కూడా ఆదేశించారు. ఈ విషయమై జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ విధానాన్ని అంగీకరించిన విషయమై కూడా చర్చించారు. రైతులకు ఆమోదయోగ్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధానానికి అనుగుణంగా భూసేకరణ చేపట్టేలా కృషి చేయాలని ఆయన సూచించారు.
జాతీయ రహదారులు, ఆ రహదారుల వెంట రెండు వరుసలలో చేపట్టాల్సిన హరిత హారం పనులలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు అవసరమైతే ముఖ్య అటవీ శాఖ అధికారి, ముఖ్య కార్యదర్శి, ఇంజనీర్-ఇన్-చీఫ్‌లు, సిజిఎం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ, కన్సల్టెంట్, కాంట్రాక్టర్ల సమావేశాన్ని ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విషయమై రహదారుల వెంట ఉన్న మొక్కలు, వాటి పోషణ ఆశాజనకంగా లేకపోవడం వల్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇరు వరుసల రహదారుల విస్తరణ కాంట్రాక్టు అగ్రిమెంట్‌లలో 5 సంవత్సరాల వరకు సంబంధిత కాంట్రాక్టర్ మొక్కలు నాటి వాటిని బ్రతికించేలా దిశానిర్దేశం చేయాలని అన్నారు. అవసరమైన మేర ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టులను సప్లిమెంట్ అగ్రిమెంట్లుగా సవరించి కాంట్రాక్టర్లకు ఆదేశాలివ్వాలని, మొక్కల పోషణకు వారిని బాధ్యులుగా చేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు వీలున్న వంతెనలకు చెక్ డ్యాంలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
ఖాళీ స్థలాల వివరాలు సేకరించండి
ఆర్‌అండ్‌బి శాఖ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాల వివరాలను సేకరించి కొత్తగా ఏర్పాటు అయ్యే జిల్లా కేంద్రాలు, పర్యాటక ప్రాధాన్యత గల పట్టణాలలో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఉపయోగపడే స్థలాలను గుర్తించాలని, వాటి వివరాలను ప్రభుత్వానికి ఆయా కలెక్టర్లకు అందించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.