రాష్ట్రీయం

సంస్కృతీ, సంప్రదాయాలను.. భావితరాలకు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ అల్వాల్/ బేగంపేట, ఆగస్టు 25: ప్రపంచంలోనే మహోన్నతమైన మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పివిఆర్‌కె.ప్రసాద్ అన్నారు. సద్గురు శివానందమూర్తి దివ్యాశీస్సులతో సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సికిందరాబాద్‌లోని టివోలి గార్డెన్స్‌లో గురువారం సాయంత్రం శ్రీకృష్ణ జయంతి వేడుకలు, శ్రీకృష్ణాష్టమి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ కె.బసవరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పివిఆర్‌కె.ప్రసాద్ చారిటబుల్ ట్రస్టు తరపున ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గెంటెల వెంకటరమణ దంపతులకు ‘శ్రీ కృష్ణాష్టమి పురస్కారం’ను ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన గురు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ గురువుకు జగద్గురువు ఉన్నారని, జగద్గురువే గురువు ద్వారా మనకు బోధనలు చేయిస్తున్నాడని అన్నారు. అన్ని జాతుల కన్నా మానవ జాతి చాలా గొప్పదని సనాతన ధర్మాన్ని కాపాడి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని అన్నారు. ముక్తి ధర్మం, గురుభక్తి భారతదేశంలోనే ఉందని, దీనికున్న ప్రాచుర్యం మరెక్కడా లేదని, దీనికి భారతీయులుగా మనం గర్వించాలని చెప్పారు. మనం ఏం చేసినా దేవుడి సంకల్పంతోనే చేస్తుంటామన్నారు. భగవంతుని సంకల్పం లేనిదే ముందుకు వెళ్లలేమని, ఎందరో మహానుభావుల్లో సద్గురు శివానందమూర్తి ఒకరని, ఆయన చూపిన మార్గంలో భక్తులు నడుచుకోవాలన్నారు.
పురస్కార గ్రహీత గెంటెల వెంకటరమణ మాట్లాడుతూ దైవ సంకల్పంతోనే సద్గురు శివానందమూర్తిని 1988లో కలిశానని వివరించారు. ఆయన ప్రతి పనిలోనూ ప్రోత్సహిస్తూ తాను సేవ చేయటానికి అవకాశం కల్పించారని స్మరించుకున్నారు. ‘నేను అందరితో సమానంగానే ఉన్నాను. గురువు ఆజ్ఞ వల్లే నేడు నేను గురు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆత్మీయంగా ఉన్నాను’ అని వ్యాఖ్యానించారు. గురుతత్వం, సమాజతత్వం ప్రతి వ్యక్తి తెలుసుకోవాలంటే ప్రతి వ్యక్తి తనలోని ‘నేను’ అనే భావనను విడనాడితేనే ప్రతి వ్యక్తికి గురుబోధ అర్థమవుతుందని, ‘నేను’గా మనిషి ఎన్ని సాధనలు, పూజలు, ధ్యానం చేసినా, అది సాధ్యం కాదని శ్రీ కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీతలో బోధించాడని గుర్తుచేశారు.
ట్రస్టీ బసవరాజు మాట్లాడుతూ గురువు ఆజ్ఞ మేరకు ట్రస్టు కొనసాగించే కార్యక్రమాలన్నింటినీ యధావిధిగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్, వరంగల్, భీమిలిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. శ్రీ కృష్ణ పూజ కార్యక్రమంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో డాక్టర్ తేజస్విని మనోజ్ఞ భరతనాట్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ కె.బసవరాజు, ముఖ్య అతిథి పివిఆర్‌కె.ప్రసాద్ డాక్టర్ తేజస్విని మనోజ్ఞను ఘనంగా సత్కరించారు.

చిత్రాలు.. .సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టు శ్రీ కృష్ణాష్టమి పురస్కారాన్ని గెంటెల వెంకటరమణ దంపతులకు బహూకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ పివిఆర్‌కె.ప్రసాద్. చిత్రంలో మేనేజింగ్ ట్రస్టీ కె.బసవరాజు

భరతనాట్య ప్రదర్శన చేస్తున్న డాక్టర్ తేజిస్విని మనోజ్ఞ