రాష్ట్రీయం

దుర్గంలో చిరుత కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 25: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గురువారం పట్టపగలు చిరుతపులి కలకలం సృష్టించింది. స్థానికుల సాయంతో అటవీ సిబ్బంది చిరుతను బంధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సమీప కొండల్లోంచి వచ్చిన చిరుత రాయదుర్గంలోని కొలిమివీధిలో ఉన్న మీసేవ కేంద్రం సమీపంలోని ముళ్లపొదల్లో దాక్కుంది. గురువారం ఉదయం చిరుతను గమనించిన స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న వారు పందులుపట్టే వారి నుంచి వలలు తెచ్చి చిరుతను పట్టుకునే ప్రయత్నం చేశారు. పొదల నుంచి బయటకు వచ్చిన చిరుత మీసేవ కేంద్రంలోని చెట్టుపైకి చేరుకుంది. వలల సాయంతో పట్టుకునేందుకు ప్రయత్నించగా తప్పించుకుని తిరిగి పొదల్లోకి చేరుకుంది. దీంతో పొదల చుట్టూ వలలు వేసి ఒడిసి పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సుమారు ఐదు గంటల పాటు చిరుత జనాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. బుధవారం రాత్రి పొదల్లోకి వచ్చిన చిరుత అక్కడే ఉన్న ఓ పందిని చంపి తినిందని జిల్లా అటవీశాఖ అధికారి ఎ.చంద్రశేఖర్ తెలిపారు. పట్టుబడిన చిరుత మగదని, వయసు ఏడాదిన్నర ఉంటుందన్నారు. చిరుతకు గ్లూకోజ్ ఆహారంగా ఇచ్చామని, దీన్ని అడవిలో వదలాలా, లేక తిరుపతి జూ పార్కుకు తరలించాలా అన్నది ఇంకా నిర్ణయించలేదన్నరు. కాగా పొదల్లో మరో చిరుత ఉన్నట్లు స్థానికులు చెప్పడంతో ప్రత్యేక బృందాలు పహారా కాస్తున్నాయి.

చిత్రాలు.. మీసేవ కేంద్రం ఆవరణలో చిరుతపులి
వలలో చిక్కిన చిరుత