రాష్ట్రీయం

ఏపీ స్పీకర్‌పై అవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 23: ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం తీర్మానం నోటీసులను వైకాపా ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీ కార్యదర్శికి అందచేశారు. ఈ నోటీసును వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శికి అందచేశారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదని, ప్రతిపక్ష పార్టీ సభ్యుల వాణిని వినిపించేందుకు అవకాశం ఇవ్వడం లేదని జ్యోతుల నెహ్రూ తెలిపారు. గతంలో తమ పార్టీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చామని,కాని ఆ తర్వాత ఉపసంహరించుకున్నామన్నారు. స్పీకర్ నిష్పక్షపాత వైఖరితో వ్యవహరిస్తారని ఆశించామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. స్పీకర్ అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.