జాతీయ వార్తలు

స్కార్పీన్ వ్యవహారంలో మరో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఫ్రాన్స్ సహకారంతో భారత్‌లో తయారవుతున్న స్కార్పీన్ జలాంతర్గామి కీలక వివరాలకు సంబంధించి మరిన్ని రహస్య పత్రాలు గురువారం బహిర్గతమయ్యాయి. బుధవారం కీలక సాంకేతిక సమాచారం ఉన్న వేలాది పత్రాలను వెలుగులోకి తెచ్చిన ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక తాజాగా మరికొన్నింటిని బయటపెట్టింది. ఈ తాజా వివరాలు స్కార్పీన్ జలాంతర్గాముల యుద్ధ తంత్ర వ్యవస్థకు సంబంధించినవి. ఫ్రాన్స్ సంస్థ డిసిఎన్‌ఎస్ ఈ జలాంతర్గాములను
ముంబయిలో నిర్మిస్తోంది. తాజాగా బయటపడ్డ పత్రాల్లో భారత నౌకాదళ గుర్తు కూడా ఉంది. సముద్ర గర్భంలో ప్రత్యర్థి నౌకల వివరాలను సేకరించడానికి ఉద్దేశించిన సోనార్ వ్యవస్థ పని తీరు ఎలా ఉంటుందో ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ సోనార్ వ్యవస్థ సాంకేతిక పరమైన అంశాలను కూడా విస్తృతంగానే బైటపడ్డాయి. ఈ తాజా పత్రాలకు సంబందించి భారత నౌకాదళంనుంచి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు. అయితే వీటివల్ల భారత జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
లీకేజి కాదు చౌర్యమే!
పారిస్: భారత్‌లో తీవ్ర సంచలనం రేపుతున్న స్కార్పీన్ జలాంతర్గాముల కీలక వివరాల లీకు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ పత్రాలు లీకు కాలేదని, నౌకాదళ కాంట్రాక్టర్ డిసిఎన్‌ఎస్ నుంచి ఇవి చౌర్యానికి గురయ్యాయని ఫ్రాన్స్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకూ బహిర్గమైన వివరాల్లో కేవలం జలాంతర్గాముల నిర్వహణకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశాయి. ఆస్ట్రేలియా పత్రిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ప్రచురితమైనప్పటి నుంచి అటు ఫ్రాన్స్, ఇటు భారత్‌లు దర్యాప్తులకు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో ‘స్కార్పీన్ పత్రాలు లీకు కాలేదు చౌర్యానికి గురయ్యాయి’అంటూ ఫ్రాన్స్ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేయడం గమనార్హం. అంతే కాదు, ఈ చౌర్యంలో డిసిఎన్‌ఎస్ నిర్లక్ష్యం కూడా ఏమీ లేదని..ఓ వ్యక్తి నిజాయితీ రాహిత్యమే ఇందుకు కారణంగా గుర్తించినట్టు పేర్కొన్నాయి.