రాష్ట్రీయం

కోస్తాంధ్రలో వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 25: త్వరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా శుక్రవారం నుంచి కోస్తాంధ్రలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. గత 20 రోజలుగా కోస్తాంధ్రలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడం తెలిసిందే. నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై లేకపోవడంతో వర్షం జాడ లేదు. అయితే బంగాళాఖాతంపై భూ ఉపరితలానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో సాధారణం కంటే 1, 2 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదు కాగా, దక్షిణ కోస్తాలో సాధారణం కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. కోస్తాంధ్రలో పలు చోట్ల గురువారం వర్షం కురిసింది. ఉపరితల ఆవర్తనం బలంగా ఉండటంతో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ దిశగా కదిలితే కోస్తాంధ్రలో వర్షాలు పడతాయి. ఆవర్తనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో చాలాచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడటానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇది మరింత బలపడే అవకాశం లేదని, కొద్ది రోజుల పాటు వర్షాలు పడే అవకాశం మాత్రం ఉందని విశ్రాంత వాతావరణ శాస్తవ్రేత రాళ్లపల్లి మురళీకృష్ణ తెలిపారు. సెప్టెంబర్ నెలలో వానలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

చిత్రం..భారీ వర్షాలకు రాజమహేంద్రవరంలో జలమయమైన ఒక ప్రధాన రహదారి