రాష్ట్రీయం

వేగం పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25:గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్టత్రో ఒప్పందాలు జరగడంతో నీటిపారుదల శాఖ వేగం పెంచింది. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక అమలును వేగవంతం చేసేందుకు సిద్ధమవుతోంది. నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు గురువారం సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో ఎల్లంపల్లి పంప్ హౌస్‌ల డ్రై రన్, సెప్టెంబర్ ఐదున వెట్ రన్ నిర్వహించాలని నిర్ణయించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం భూ సేకరణ పనులు వారంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంప్ హౌస్‌ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. సంబంధిత బ్యారేజీల వద్ద క్యాంప్‌లు ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని వర్కింగ్ ఏజెన్సీలను కోరారు. వేమునూరు, గంగాధర, మేడారం పంపుహౌస్‌ల డ్రై రన్ ను వారంలో ప్రారంభించాలని, సెప్టెంబర్ ఐదున వెట్ ట్రయల్ రన్‌ను ప్రారంభించేందుకు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎల్లంపల్లిలో మిగిలిపోయిన 920 ఎకరాల భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు. ఇది పూర్తయితే ఈ ప్రాజెక్టు కింద 1,65,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. తోటపల్లి ప్రాజెక్టు కోసం సేకరించిన 1600 ఎకరాలను తిరిగి గ్రామస్తులకే ఇచ్చే అంశాన్ని సమావేశంలో చర్చించారు.

చిత్రం.. ప్రాజెక్టులపై గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్‌రావు