రాష్ట్రీయం

సాగర్ ఎడమకాల్వకు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 25: నాగార్జునసాగర్ జలాశయం నుండి గురువారం ఎడమకాల్వ ద్వారా నీటి విడుదలను ప్రారంభించారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ్యులు భాస్కర్‌రావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎడమకాల్వ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మాజీ ప్రధానమంత్రి లాల్‌బహదూర్‌శాస్ర్తీ విగ్రహానికి మంత్రి జగదీశ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎడమకాల్వ ద్వారా 30 టిఎంసిల నీటిని విడుదల చేయనున్నారు. గురువారం నుండి 12 రోజులపాటు 8 వేల క్యూసెక్కుల వంతున విడుదల చేసి ఆపై వారం రోజులు నీటి విడుదలను నిలిపివేస్తారు. మళ్లీ వారం రోజులపాటు 5 వేల క్యూసెక్కుల వంతున నీటి విడుదల కొనసాగిస్తూ ఇలా ఆరు విడతలుగా ఎడమకాల్వకు నీటినివిడుదల చేయనున్నారు. ఎడమకాల్వ పరిధిలోని మొదటి జోన్ వరకు ఈ నీటి విడుదల కొనసాగనుంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో 514.50 అడుగుల నీటిమట్టం ఉండగా ఎస్‌ఎల్‌బిసి ద్వారా 1800 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుండి ఎటువంటి నీరు సాగర్‌కు రావడంలేదు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ సాగర్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, ప్రాజెక్టు సిఇ సునీల్, ఎస్‌ఇ రమేశ్, ఇఇ వెంకట్‌రెడ్డి, డిఇ విజయ్‌కుమార్, ఎంసి.కోటిరెడ్డి, పెద్దవూర ఎంపిపి మల్లిక, బ్రహ్మారెడ్డి, శేఖర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
నవంబర్ 15 వ రకు నీరువిడుదల
ఎడమకాల్వ పరిధిలో మొదటి జోన్‌కు గురువారం నుండి ఆరుతడులుగా నవంబర్ 15 వరకు నీటిని విడుదల చేస్తామని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటలకు గాను నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతాంగం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని, వరినారు వేసుకోవద్దని రైతులను కోరారు. కొత్తగా వరి నారు వేసుకుంటే రైతులు నష్టపోతారని ఈ విషయం గమనించాలని తెలిపారు.

చిత్రాలు.. ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి,
ఎంపి గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, సిఇ సునీల్...