రాష్ట్రీయం

హాజీ అలీ దర్గాలోకి మహిళలకూ ప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 26: ముంబయిలోని ప్రఖ్యాత హాజీ అలీ దర్గాలోపలికికి మహిళల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ బొంబాయి హైకోర్టు శుక్రవారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఒక ప్రార్థనా స్థలంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగకరమని కోర్టు అభిప్రాయ పడింది. ‘హాజీ అలీ దర్గాలోపలికి మహిళల ప్రవేశంపై దర్గా ట్రస్టు విధించిన నిషేధం భారత రాజ్యాంగంలోని 14, 15, 25 అధికరణలకు విరుద్ధమని మేము భావిస్తున్నాం. పురుషులతో సమానంగా మహిళలను కూడా దర్గాలోపలికి అనుమతించాలి’ అని న్యాయమూర్తులు విఎం కానడై, రేవతి మోహితే డేరేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళలను దర్గాలోపలికి అనుమతించడం లేదంటూ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన జకియా సోమన్, నూర్జహాన్ నియాజ్ అనే మహిళలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన పిటిషన్ (పిల్)ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని హాజీ అలీ దర్గా ట్రస్టు తెలపడంతో ధర్మాసనం తమ తీర్పు అమలును ఆరువారాలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 2102కుముందు దర్గాలోకి మహిళలను అనుమతిస్తూ ఉండే వారని పిటిషనర్లు తమ పిటిషన్‌లో వాదించారు. దర్గాలోపల మహిళల భద్రత, రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం, ట్రస్టు తగు చర్యలు తీసుకోవాలని కూడా బెంచ్ ఆదేశించింది. దర్గాలోపలికి మహిళలను అనుమతించకపోవడం సరికాదని మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతకు ముందు తెలిపింది. ప్రార్థనలు చేసే హక్కు మహిళలకు, పురుషులకు సమానంగా ఉండాలని బెంచ్ అభిప్రాయ పడింది. దీన్ని మార్చే అధికారం ట్రస్టుకు ఎంతమాత్రం లేదని కూడా కోర్టు తన 56 పేజిల తీర్పులో స్పష్టం చేసింది. ఒక పురుష ముస్లిం సన్యాసి సమాధి దగ్గరగా వెళ్లడానికి మహిళలను అనుమతించడం ఇస్లాంలో పాపమని ట్రస్టు తరఫు న్యాయవాదులు వాదించారు. తమ వాదనలను సమర్థించుకోవడానికి వారు ఖురాన్‌లోని కొన్ని భాగాలను సైతం ఉటంకించారు. అయితే కోర్టు వారి వాదనలను అంగీకరించలేదు. 2012కు ముందు మహిళలను అనుమతించినప్పుడు ఇప్పుడు అనుమతించకపోవడానికి బలమైన కారణాలు ఏమీ కనిపించడం లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

చిత్రం... బాంబే హైకోర్టు తీర్పుతో శుక్రవారం భారతీయ ముస్లిం కార్యకర్తల ఆనందోత్సాహాలు