రాష్ట్రీయం

రబీలో ప్రీమియం 1.5 శాతమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: రాబోయే సీజన్‌లో వరి పంటకు రైతు కేవలం 1.5 శాతం బీమా ప్రీమియం చెల్లించ వలసి ఉంటుందని వ్యవసాయ ఉత్పత్తుల కమిషనర్ సి పార్థసారథి తెలిపారు. సచివాలయంలో శుక్రవారం రబీ సీజన్ పంటల బీమాపై రాష్ట్ర స్థాయి సాంకేతిక సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో వరి పంట బీమా కోసం రైతులు ప్రీమియం రెండు శాతం చెల్లించగా, రబీ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతు భారాన్ని కొంత తగ్గిస్తూ 1.5 శాతం చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వాణిజ్య, ఉద్యాన పంటలకు 2.5 శాతం బీమా చెల్లించాలని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా 2016-17 రబీ సీజన్‌లో 11 పంటలను ప్రతిపాదించినట్టు తెలిపారు. వరి, జొన్న, మొక్కజొన్న, పెసలు, మినుములు, వేరుశనగ, శనగ, పొద్దు తిరుగుడు, మిరప, ఉల్లి, మామిడి పంటలకు బీమాలో ప్రతిపాదించినట్టు తెలిపారు. రబీ సీజన్‌లో రాష్ట్రాన్ని మూడు క్లస్టర్‌లుగా విభజించడం జరిగిందని, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ క్లస్టర్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ ఒక క్లస్టర్‌గా నల్లగొండ ఖమ్మం, రంగారెడ్డి మరొక క్లస్టర్‌గా విభజించారు. క్లస్టర్‌ల వారిగా పంట బీమా చెల్లింపులు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన దాదాపు 16 బీమా కంపెనీలు ముందుకు వచ్చాయి.