తెలంగాణ

ఒప్పించడంలో ఆలస్యమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: తాము అధికారంలో ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తుకు పెంచే విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో జాప్యం జరిగిందని సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ తాము అప్పట్లో చేసిన ప్రతిపాదనను అమలు చేయకుండా ఎదురు దాడి చేస్తున్నదని జానారెడ్డి శుక్రవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యక్తులను టార్గెట్ చేసేలా, ప్రతిపక్షాలను బెదిరించేలా మాట్లాడడం భావ్యం కాదని అన్నారు.
ఉద్యమం సమయంలో ఊతపదాలు వాడినట్లే ఇప్పుడూ వాడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శలను సానుకూలంగా తీసుకోకుండా జైల్లో పెట్టిస్తామంటూ ఎదురు దాడి చేస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన తమపై ఉందని అన్నారు. ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు. మహారాష్టత్రో కుదుర్చుకున్న ఒప్పందం చారిత్రాత్మక తప్పిదం అని ఆయన విమర్శించారు. ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెబుతారని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంచే విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించలేదని, ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లలేదని అన్నారు. డిపిఆర్ కావాలని జూన్ 21న తాను ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పటి వరకు స్పందన లేదని ఆయన తెలిపారు. సంవత్సరానికి రెండు పంటలకు నీరు ఇచ్చి రైతుల కాళ్లు కడుగుతానన్న ముఖ్యమంత్రి ఆ మాట నిలబెట్టుకోవాలని అన్నారు. సూక్ష్మ సేద్యం ఖర్చు ప్రభుత్వం భరిస్తుందా? రైతులు భరించాలా? అనే స్పష్టత ఇవ్వలేదని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నదన్న భావన కల్పించడం సరైంది కాదని అన్నారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. మాటకు, మాట మానుకుని పరస్పరం సహకరించుకుందామని జానారెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌లో ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా నాయకుల మధ్య తలెత్తిన వివాదం గురించి ప్రశ్నించగా, గద్వాలను కూడా జిల్లా చేస్తే సరిపోతుందని అన్నారు.