తెలంగాణ

ముదిరిన ముసాయదా లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/మహబూబ్‌నగర్, ఆగస్టు 26: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రభుత్వం జారీచేసిన ముసాయిదాపై వివాదం ముదురుతోంది. జిల్లా హోదా దక్కని సిరిసిల్ల, రెవెన్యూ డివిజన్ హోదా దక్కని కోరుట్ల, ఇతర జిల్లాల్లోకి తమ మండలాలను కల్పవద్దంటూ హుస్నాబాద్‌లో శుక్రవారం ఆందోళనలు ఉదృతంగా కొనసాగాయి. సిరిసిల్లను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ ఏడుగురు సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేయగా, సిరిసిల్లకు వచ్చిన టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావును ఆందోళనకారులు అడ్డుకున్నారు. కోరుట్ల డివిజన్ సాధన కోసం చేపట్టిన ఆందోళన శుక్రవారం 4వ రోజుకు చేరగా, ముస్లిం మైనార్టీ నాయకులు 2వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోరుట్ల తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. దేశరాజుపల్లి గ్రామాన్ని రామడుగు మండలంలో కాకుండా కొత్తగా ఏర్పడనున్న కొత్తపల్లి మండలంలో కలపాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల, కరీంనగర్ ప్రధాన రహదారిపై దేశరాజుపల్లి గ్రామ స్టేజీ వద్ద గ్రామస్తులు పెద్దసంఖ్యలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హుస్నాబాద్‌లో ఆందోళనలు కొనసాగాయి. ఏదిఏమైనా జిల్లాల ముసాయిదాపై నిరసనలు కొనసాగుతున్నాయ. కాగా, జిల్లాల పునర్విభజనపై ఇప్పటివరకు మొత్తం 1,542 అభ్యర్థనలు రాగా, వీటిలో జిల్లాల కోసం 340, రెవెన్యూ డివిజన్ల కోసం 1,128, మండలాల కోసం 74 అభ్యర్థనలు వచ్చాయి.
మహబూబ్‌నగర్‌లో
రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన ముసాయిదా మహబూబ్‌నగర్ జిల్లాలో రగడకు దారి తీసింది. గద్వాల జిల్లాను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ అఖిల పక్షం మూడు రోజుల బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో నడిగడ్డలోని తెరాస నాయకులు కూడా అఖిలపక్షం వైపు మళ్లారు. శుక్రవారం మొదటిరోజు బంద్ సూపర్ సక్సెస్ అయ్యింది. అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో బంద్ సంపూర్ణంగా కొనసాగింది. పార్టీలకు అతీతంగా నిర్వహించిన ఈ బంద్ సూపర్ సక్సెస్ అయ్యింది. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహాంతో పాటు గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ పద్మావతి, వివిధ మండలాల్లోని ప్రజాప్రతినిధులు బంద్‌లో పాల్గొన్నారు. గద్వాలలో అఖలపక్షం నేతలను ఆరెస్టు చేయడంతో ఉద్రిక్తతలకు దారి తీసింది. బంద్ వలన రాకపోకలు నిలిచిపోవడం, దుకాణాలు మూతపడడంతో గద్వాల నిర్మానుష్యంగా మారింది. ఇదిలావుంటే, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటులో కూడా ప్రభుత్వం వివక్షత చూపిందని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో పాటు బిజెపి నేత ఆచారితో పాటు వివిధ పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. కల్వకుర్తి నియోజకవర్గంలో జెఎసిగా ఏర్పడి ధర్నాలు నిర్వహించారు. శుక్రవారం సైతం కల్వకుర్తిలో నిరాహార దీక్షకు దిగారు. కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. గత 20 ఏళ్ల నుండి కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికిని ఎట్టకేలకు అచ్చంపేట రెవెన్యూ డివిజన్‌గా చేస్తున్నట్లు, అందులో కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఉంచుతున్నట్లు ముసాయిదాలో ఉంచడంతో కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు భగ్గుమన్నారు. వనపర్తి జిల్లాలోకి కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల నుండి కొన్ని మండలాలను చిల్చి అందులో కలిపారు. దింతో రగడ మొదలైంది. ప్రజాప్రతినిధులకు పరిపాలన సౌలభ్యం కుదరదని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. బండర్‌పల్లి గ్రామాన్ని మరికల్ మండలంలో చేర్చి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచాలంటూ 500 మందికిపైగా గ్రామస్థులు శుక్రారం 30కిలో మీటర్ల పాదయాత్ర నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.
కరీంనగర్, జగిత్యాల ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న దేశరాజుపల్లి గ్రామస్థులు
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌కు పాదయాత్ర నిర్వహిస్తున్న బండర్‌పల్లి గ్రామస్థులు