తెలంగాణ

నడిగడ్డ బంద్ జయప్రదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 26: గద్వాలను జిల్లా చేయాలని గత కొంత కాలంగా చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నడిగడ్డలో నిరసనలు మిన్నంటాయి. అఖిలపక్షం ఆధ్వర్యంలో మూడురోజుల నడిగడ్డ బంద్‌కు పిలుపునివ్వగా మొదటిరోజు శుక్రవారం బంద్ విజయవంతమైంది. ఉదయం నుంచే అఖిలపక్షం నేతలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగడంతో ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న గద్వాల డిఎస్‌పి బాలకోటి, సిఐ సురేష్‌లు బస్టాండ్‌కు చేరుకొని 144 సెక్షన్ అమలులో ఉండగా ఆందోళనలు చేయడం తగదని హెచ్చరించారు. అయినప్పటికీ ఆందోళన కొనసాగడంతో పలువురిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. దుకాణాలు, ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు తెలిపారు. దీంతో గద్వాల ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. అనంతరం పట్టణంలో అఖిలపక్షం నేతలు భారీ ర్యాలీలు నిర్వహించారు. 144 సెక్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయంకు చేరుకొని వినతిపత్రం సమర్పించారు. కొన్నిచోట్ల ఆందోళన కార్యక్రమాలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న అఖిలపక్ష నాయకులు
గద్వాలలో బంద్ కారణంగా డిపోకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు