తెలంగాణ

ముఖ్యమంత్రి చేతుల మీదుగా వైద్య కళాశాల ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, ఆగస్టు 26: మెదక్ జిల్లా ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామ సమీపంలో నిర్మించిన ఆర్‌విఎమ్ వైద్య కాళాశాలను శుక్రవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు శశిధర శర్మ ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలుకగా ఆర్‌విఎం కళాశాల చైర్మెన్ డాక్టర్ యాకయ్య సిఎం కెసిఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాగా ఆర్‌విఎం సంస్థవారు 16 ఎకరాలలో 350 పడకల ఆసుపత్రి నిర్మాణం, రీసెర్చ్ సెంటర్, విద్యార్ధినీ, విద్యార్ధులకు హాస్టల్ భవనాలను, బోధనా సిబ్బందికి నివాస గృహాలను నిర్మించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలతో వైద్యం అందించడానికి ఆర్‌విఎం సంస్థ వారు ఏర్పాట్లను చేశారు. గత నెల న్నర రోజులుగా ఈ ఆసుపత్రిలో నిజామాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించిన ప్రజలకు ఆరోగ్య సేవలను అందిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌అలి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, హరీశ్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

రిబ్బన్ కత్తిరించి ఆర్‌విఎం వైద్య కళాశాలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్