రాష్ట్రీయం

వచ్చే నెలకి ఇంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: శ్రీశైలంనుంచి సెప్టెంబర్ నెల అవసరాలకోసం తెలంగాణకు 15 టిఎంసిలు, ఎపికి 36 టిఎంసిలు విడుదల చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటి నిర్ణయించింది. బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, రెండు రాష్ట్రాల ఇంజనీర్-ఇన్-చీఫ్‌లు మురళీధర్, వెంకటేశ్వరరావులతో కూడిన త్రిసభ్య కమిటీ శనివారం జలసౌధలో సమావేశమైంది. రెండు రాష్ట్రాల సాగు, తాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం జరిగిన సమావేశానికి కొనసాగింపుగా శనివారం ఈ భేటీ జరిగింది. రెండు రాష్ట్రాలు తమ అవసరాలను త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకువచ్చాయి. తెలంగాణకు వచ్చే మూడునెలలకోసం నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద సాగుకోసం 31 టిఎంసిలు, హైదరాబాద్ తాగునీటికి ఆరు టిఎంసిలు, నల్లగొండ జిల్లా తాగునీటికి 4 టిఎంసిలు అవసరం అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఖరీఫ్‌కు తక్షణమే 12 టిఎంసిలు, అక్టోబర్‌లో 15 టిఎంసిలు, మిగతానీరు ఆ తర్వాత అవసమవుతుందని వివరించారు. సెప్టెంబర్‌లో హైదరాబాద్ నగరంతోపాటు నల్లగొండ జిల్లాలో తాగునీటి అవసరాలకోసం మూడు టిఎంసిలు అవసరం అవుతాయని వివరించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన త్రిసభ్య కమిటీ సెప్టెంబర్ నెల అవసరాలకోసం 15 టిఎంసిలను విడుదల చేయాలని నిర్ణయించింది. సాగర్ ఎడమకాలువకు 12.50 టిఎంసిలు, హైదరాబాద్ తాగునీటికి 1.50 టిఎంసిలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు ఒక టిఎంసి అంటే మొత్తం 15 టిఎంసిలు వినియోగించుకోవాలని కమిటీ సూచించింది.ఇలాఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెప్టెంబర్ నెల వరకే 47 టిఎంసిల నీరు అవసరం అవుతుందని నివేదిక ఇచ్చింది. నాగార్జునసాగర్ కుడికాలువకు 10 టిఎంసిలు, ఎడమకాలువకు నాలుగు టిఎంసిలు, కృష్ణాడెల్టాకు 12 టిఎంసిలు, హంద్రీనీవాకు ఐదు టిఎంసిలు, గాలేరు-నగరికి ఆరు టిఎంసిలు, తెలుగుగంగకు ఐదు టిఎంసిల నీరు అవసరం అవుతుందని ఎపి ఉన్నతాధికారులు త్రిసభ్య కమిటీకి విన్నవించారు. కాగా సెప్టెంబర్ నెలలో ఎపి అవసరాలకోసం 36 టిఎంసిలను ఇచ్చేందుకు అంగీకరించింది. నాగార్జునసాగర్ కుడికాలువకు 10, ఎడమకాలువకు రెండు టిఎంసిలు, కృష్ణా డెల్టాకు 10 టిఎంసిలు, తెలుగుగంగ, చెన్నై తాగు నీటి అవసరాలకోసం ఐదు టిఎంసిలు, హంద్రీనీవాకు నాలుగు టిఎంసిలను కేటాయించారు. ఉభయ రాష్ట్రాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు కెఆర్‌ఎంబి సభ్యులు ఆయా ప్రాంతాలకు వెళ్లి రావాలని నిర్ణయించారు.