క్రీడాభూమి

కాంగ్రెస్ హయాంలో ఒప్పందాలు ఉత్తిమాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం సాగించిన కృషి, కొన్ని దశాబ్దాల పాటు నత్తనడక నడిచిన తీరుపై నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం సోదాహరణగా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు పలు రకాలుగా విమర్శలు చేయడంతో ఈ ప్రాజెక్టు వాస్తవ స్థితి గతుల గురించి మీడియాకు వర్క్ షాప్ తరహాలో హరీశ్‌రావు వివరించారు. 1975లో జలగం వెంగళరావు హయాంలో ఏం జరిగింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రయత్నాలు ఏ విధంగా చేసిందో ఆధారాలతో సహా హరీశ్‌రావు వివరించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను, గతంలో జరిగిన ప్రయత్నాలు, తాజా ఒప్పందాలతో కూడిన బుక్‌ను రూపొందించి మీడియాకు అందజేశారు. తెలంగాణకు ప్రాణవాయువు లాంటి కీలకమైన ఈ ప్రాజెక్టుకు సంబంధించి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. సాధారణంగా విలేఖరుల సమావేశం తరహాలో కాకుండా ప్రాజెక్టు గురించి వివరించారు. 1975 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను వివరించారు. ప్రతిపాదనలే తప్ప కాంగ్రెస్ హయాంలో ఒప్పందాలు జరగలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన రెండేళ్ల కాలంలో మహారాష్టత్రో ప్రాజెక్టుల కోసం 12 సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు. 2017 డిసెంబర్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ ద్వారా సాగునీటిని అందించనున్నట్టు చెప్పారు. తొలి లబ్ధిదారు వరంగల్, నల్లగొండ జిల్లాలు అని హరీశ్‌రావు వివరించారు. మహారాష్టత్రో ఒప్పందం కోసం చేసిన ప్రయత్నాలను వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో ప్రభుత్వం మూడు సమావేశాలు జరిపితే, టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేళ్లలో 12 సమావేశాలు నిర్వహించినట్టు చెప్పారు.
తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుపై గతంలో ఒప్పందాలు జరగలేదని చెప్పారు. 152 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీరు అందించవచ్చు అని విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. 152 మీటర్లు అయినా, 148 మీటర్లు అయినా తుమ్మిడిహట్టి నుంచి మల్లారం వరకు గ్రావిటీ ద్వారా కేవలం 20వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు లభిస్తుందని అన్నారు. అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ ద్వారా నీరు అందించాల్సిందేనని తెలిపారు. తుమ్మిడి హట్టి ప్రాజెక్టు పరిధి తగ్గించడానికి సిడబ్ల్యుసి లేఖ కూడా కారణమని అన్నారు. ప్రాణహితపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి డిపిఆర్ పంపించగా, 4.3.2015 న స్పందించి సిడబ్ల్యుసి నాటి ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతంలో అనుకున్నంత నీటి లభ్యత లేదని అప్పటి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు హరీశ్‌రావు తెలిపారు. తుమ్మిడి హట్టి వద్ద 160 టిఎంసిల నీటి లభ్యత ఉందని గత ప్రభుత్వం ప్రతిపాదిస్తే, సిడబ్ల్యుసి అక్కడ 102 టిఎంసిల నీటి లభ్యతే ఉందని 46 టిఎంసిలు మాత్రమే మళ్లింపునకు అనువుగా ఉన్నాయని పేర్కొందని హరీశ్‌రావు తెలిపారు. 46 టిఎంసిలతో 16.40లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం సాధ్యమా? అని ప్రశ్నించారు.
2007లో 17,500 కోట్ల అంచనాతో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జీవో జారీ చేశారని, 2008లో అనూహ్యంగా దానిని 38,500 కోట్లకు పెంచారని తెలిపారు. 2009 ఎన్నికలకు ముందు నాలుగు జిల్లాల్లో శంకుస్థాపన చేశారని తెలిపారు. 2008లో ప్రిలిమినరీ అంచనా 42,300 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారని తెలిపారు. సిమెంట్, స్టీల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయని అన్నారు. ముంపు బాధితులకు ఎకరానికి రెండు లక్షల ధర అప్పుడు నిర్ణయించారని, ఇప్పుడు ఏడు లక్షల వరకు చేరుకుందని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వరుస బ్యారేజీల వల్ల ఎప్పుడూ 60 కిలో మీటర్ల వరకు నదిలో 32 టిఎంసిల నీరు నిల్వ ఉంటుందని చెప్పారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ ద్వారా సాగునీరు అందించాలని నిర్ణయించినట్టు హరీశ్‌రావు తెలిపారు.

చిత్రం.. కాళేశ్వరం ప్రాజెక్టుపై వివరాలు వెల్లడిస్తున్న మంత్రి హరీశ్