రాష్ట్రీయం

సూపర్ పవర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవిస్తే విద్యుత్ తిప్పలు తప్పవన్న ఉద్యమకాలంనాటి ప్రచారానికి భిన్నమైన వాతావరణం ఆవిష్కృతమవుతోంది. విద్యుత్తే ఇప్పుడు తెలంగాణకు అదనపు బలం కాబోతోంది. సాగు విస్తీర్ణం పెంచేందుకు పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాలకు ప్రణాళికలు సిద్ధం చేసిన తెలంగాణలో విద్యుత్‌కు బెంగపడాల్సిన అవసరం లేదన్న ధీమా అటు సర్కారులోను, ఇటు అధికార యంత్రాంగంలోనూ కనిపిస్తోంది. నిజానికి ఒక్క కాళేశ్వరం ఎత్తిపోతలకే 3300 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఇక రాష్ట్రంలో సిద్ధమవుతోన్న అన్ని ఎత్తిపోతల పథకాలకు దాదాపు 7వేల మెగావాట్ల విద్యుత్ అవసరమన్నది అంచనా. ఇంత విద్యుత్‌ను ప్రభుత్వం ఎక్కడి నుంచి తీసుకొస్తుందన్న అనుమానాలు నిన్న మొన్నటి వరకూ ముసురుకున్నాయి. కాని, కలిసొస్తున్న కాలంలో తెలంగాణ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌పరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిన దాదాపు లక్ష మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిపివేశారు. అయితే, అక్కడి మిగులు విద్యుత్‌ను అందుకునేందుకు మూడు మార్గాల్లో తెలంగాణకు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితే తెలంగాణ సొంతంగా ఉత్పత్తి చేయనున్న విద్యుత్‌కు తోడు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తీసుకునే చౌక విద్యుత్‌తో తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రంగా బలపడే అవకాశాలు లేకపోలేదని విద్యుత్ నిపుణుల అంచనా. ప్రస్తుతం జెన్‌కో 5800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. ఎన్‌టిపిసి ప్రత్యేకంగా తెలంగాణకే పరిమితం చేస్తూ 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయనుంది. మరోపక్క 3వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయనున్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో సైతం విద్యుదుత్పత్తి మొదలవుతోంది. ఇక ఉత్తరాది నుంచి విద్యుత్‌ను తీసుకునే మార్గాల్లో భాగంగా అంగుల్ -సనా కనెక్టివిటీ పూరె్తైంది. వార్దా-డిచ్‌పల్లి కనెక్టివిటీ పనులు చివరి దశకు చేరాయి. ఎరోరా- వరంగల్ కనెక్టివిటీ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ మూడు కనెక్టివిటీలు పూరె్తైతే ఉత్తరాది నుంచి తెలంగాణకు కావాల్సినంత విద్యుత్ లభిస్తుంది. ఇటీవలే ప్రధాని దేశవ్యాప్త విద్యుత్ లింకేజీని ప్రకటించారు. దీనివల్ల రూ. 1.10కే యూనిట్ విద్యుత్ లభిస్తుంది. తెలంగాణ లెక్కల ప్రకారం మూడు కనెక్టివిటీలు పూరె్తైతే, అంత తక్కువకు కాకున్నా యూనిట్‌కు రూ.1.20 నుంచి రూ.2 మధ్యలో విద్యుత్ లభించొచ్చని విద్యుత్ శాఖ అధికార్లు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఎత్తిపోతల పథకాల పూర్తికి ముందే కనెక్టివిటీలు పూర్తవుతాయని, దీనివల్ల తెలంగాణకు విద్యుత్ సమస్య తలత్తే అవకాశమే లేదని అంటున్నారు. రాష్ట్రంలో సొంతంగా ఉత్పత్తి చేసే విద్యుత్ ధరకన్నా ఉత్తరాది నుంచి తక్కువ ధరకు లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో యూనిట్ ఉత్పత్తికి రూ.4 ఖర్చవుతోందని, కానీ కనెక్టివిటీ పూరె్తైతే ఉత్తరాది నుంచి రూ.2కే యూనిట్ విద్యుత్ అందుతుందని అంటున్నారు. మూడు మార్గాల్లో కనెక్టివిటీ పూర్తిచేసి, ఉత్తరాది విద్యుత్ అందుకోగలిగితే వ్యవసాయ విద్యుత్‌పై ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గుతుంది. ప్రస్తుతం విద్యుత్ సబ్సిడీగా ప్రభుత్వం 4.5 వేల కోట్లు భరిస్తుంది. ఈ భారంలో కనీసం వెయ్యి కోట్ల భారం ఉపసంహారం కావొచ్చన్నది అధికారుల అంచనా. అదేవిధంగా పారిశ్రామిక, గృహావసరాల విద్యుత్ ధరలూ క్రమంగా తగ్గే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 21 లక్షల వ్యవసాయ బోరు బావులున్నాయి. ఎత్తిపోతల పథకాలు పూరె్తైన తరువాత బోరు బావుల విద్యుత్ వినియోగమూ తగ్గుతుంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే, సమస్య అనుకున్న విద్యుత్తే తెలంగాణక అదనపు బలమవుతుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.