రాష్ట్రీయం

ఏపికి హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: రాష్ట్ర విభజన వల్ల సుందరమైన హైదరాబాద్ వంటి మహోన్నత నగరాన్ని కోల్పోయామనే బాధ ఏ ఒక్కరికీ వలదు... ప్రపంచంలోనే పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానం, బెజవాడ కనకదుర్గమ్మ గుడి ఆంధ్రప్రదేశ్‌కు దక్కాయని, ఇంతకంటే ఏం కావాలని మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డి దేవెగౌడ అన్నారు. నగరంలో రాశిక్‌జెమ్స్ జ్యూయలరీ షోరూమ్‌ను ప్రారంభించడానికి వచ్చిన దేవెగౌడ కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలన్నింటితో పాటు నాడు పార్లమెంట్ సాక్షిగా యుపిఎ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనంటూ ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జిఎస్‌టి అమలు చేస్తామంటూ 42 శాతం ఆదాయం ఇస్తున్నందున ప్రత్యేక హోదా అవసరం లేదని, అలాగే వెనుకబడిన రాష్ట్రాలకు ఇప్పటివరకు ఇస్తూ వస్తున్న ప్రత్యేక హోదా పేరిట ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ ఎత్తివేస్తున్నామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లీ ప్రకటించడం సరైంది కాదన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన స్థాయిలో ఆర్థిక సహాయం అందుతుంటే ఆంధ్ర వంటి వెనుకబడిన రాష్ట్రాలు ఎప్పుడు ముందుకెళ్లగలవని ప్రశ్నించారు. ఈ విషయంలో పవన్‌కల్యాణ్‌ను అనుమానించాల్సిన అవసరం లేదని, ఆయనలో ప్రత్యేక హోదా కోసం తపనపడే పోరాట పటిమ ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రబాబు, అటు కెసిఆర్ బాగా పనిచేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. చంద్రబాబు ఎంతో సమర్థుడని రాజధాని అమరావతి నగరాన్ని దేశంలోనే ఒక అద్భుత మోడల్ రాజధానిగా తీర్చిదిద్దగలరంటూ దేవెగౌడ ప్రశంసించారు.

విలేఖరులతో మాట్లాడుతున్న మాజీ ప్రధాని దేవెగౌడ