రాష్ట్రీయం

బాబుకు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని ఏసిబి కోర్టు ఆదేశించింది. వచ్చేనెల 29వ లోగా విచారణ పూర్తి చేయాలని అవినీతి నిరోధక శాఖను కోర్టు ఆదేశించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల ముడుపులిస్తూ టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రత్యక్షంగా పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో స్టిఫెన్‌సన్‌తో ఏపి సియం చంద్రబాబు మాట్లాడినట్లు లీకైన ఆడియో టేపుల్లోని స్వరంపై అంతర్జాతీయ ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందుంచారు. ఈ నివేదిక ఆధారంగా కేసుపై పునర్విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పిటిషనర్ వాదనలతో ఏసిబి కోర్టు ఏకీభవించింది. ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఓటుకు కోట్లు కేసులో సరైన విచారణ జరగలేదని ఆయన అన్నారు. అంతర్జాతీయ ఫోరెన్సిక్ నివేదికను పరిగణనలోకి తీసుకొని ఉత్తర్వులు ఇవ్వాలని, తిరిగి విచారణ జరిపించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆయన వాదనలతో ఏసిబి కోర్టు ఏకీభవించింది. ఇదిలావుంటే, ఓటుకు నోటు కేసు పునర్విచారించాలన్న ఏసిబి కోర్టు ఆదేశాలు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సిఎం చంద్రబాబు అకస్మాత్తుగా పర్యటనను రద్దు చేసుకుని విజయవాడకు బయలుదేరారు. టేపుల్లో బాబు స్వరంపై అంతర్జాతీయ ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందుంచడంతో కేసు మళ్లీ సంచలనమైంది. దాదాపు ఏడాది కాలంగా కేసు ముందుకు సాగింది లేదు. అప్పట్లో స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్టు చెబుతున్న టేపులు అసలైనవేనని, అతికించినవి కావని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినట్టు సమాచారం. దాంతో పాటు ఈ స్వరం కూడా చంద్రబాబుదేనని శాస్ర్తియంగా నిర్ధారించారు. తాజాగా చంద్రబాబు పలు సందర్భాల్లో మాట్లాడిన స్వర నమూనాలను, ఓటుకు నోటు కేసులో వినిపించిన సంభాషణలను అంతర్జాతీయంగా పేరొందిన మరో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ ల్యాబ్ అందించిన నివేదికలోనూ ఈ స్వరం చంద్రబాబుదేనని తేల్చారు. వీటి ఆధారంగానే ఇపుడు ఏసిబి కోర్టులో కేసు దాఖలు చేశారు.
సిఎం చంద్రబాబు పర్యటన షెడ్యూలులో మార్పులు చేశారు. తిరుపతిలో రెండు రోజుల పాటు చంద్రబాబు పర్యటించాల్సి ఉండగా, తిరుపతి కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తంబళ్లపల్లి నుండి విజయవాడకు పయనమయ్యారు.