తెలంగాణ

ఎయిర్ హోస్టెస్‌పై అత్యాచార యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: ప్రైవేట్ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఎయిర్ హోస్టెస్‌పై క్యాబ్‌డ్రైవర్ అత్యాచార యత్నానికి ఒడిగట్టిన సంఘటన వెలుగుచూసింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రముఖ విమానయాన సంస్థలో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న యువతి సోమవారం అర్ధరాత్రి ఉప్పర్‌పల్లి హ్యాపీ హోమ్స్‌కాలనీ రోడ్డుపై క్యాబ్‌ను పికప్ చేసుకుంది. ట్యాక్సీ డ్రైవర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లాల్సి ఉండగా, యువతిని జనసంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. అప్పటికే అప్రమత్తమైన యువతి అరుపులు, కేకలు వేసింది. దీంతో క్యాబ్ డ్రైవర్ తన స్నేహితులైన మరికొందరి సహాయంతో ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడటమే కాకుండా, ఆమె నుంచి సెల్‌ఫోన్, నగదు లాక్కొని పరారయ్యారు. షాక్ నుంచి తేరుకొని, మరో ట్యాక్సీని పికప్ చేసుకుంది. ట్యాక్సీ డ్రైవర్ సెల్‌ఫోన్ సాయంతో తనపై జరిగిన అఘాయిత్యంపై బంధువులకు సమాచారం అందించి, రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాబ్‌డ్రైవర్ తనతో అసభ్యంగా వ్యవహరించి తనపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడని, తన ఫోన్, డబ్బులను లాక్కొని శంషాబాద్ శివార్లలో వదిలేసి పరారయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై స్పందించిన డిసిపి సన్‌ప్రీత్‌సింగ్ నేతృత్వంలో నిందితుడిని పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వెంట పెట్టుకొని ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలైన హిమాయత్‌సాగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. అలాగే ఆ ప్రాంతంలోని సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా ఎయిర్‌హోస్టెస్‌ను టవేరా వాహనంలో తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డిసిపి సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు.