రాష్ట్రీయం

ఏం చేద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 30: ‘ఓటుకు నోటు’ కేసు పునర్విచారణకు ఏసిబి కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సిఎం కెసిఆర్, ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఎకె ఖాన్, అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి మంగళవారం గవర్నర్‌తో సమావేశం కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. శాసనసభలో జిఎస్టీ బిల్లు ఆమోదం పొందగానే సిఎం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తర్వాత కొద్దిసేపటికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఏసీబీ డిజి ఎకె ఖాన్, తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రాజీవ్ శర్మ పదవీకాలాన్ని మరో మూడు నెలలు పాటు కొనసాగిస్తూ కేంద్రం నుంచి అధికారికంగా ఉత్తర్వులు అందిన విషయాన్ని గవర్నర్ దృష్టికి సిఎం తీసుకెళ్లారు. రాజీశ్ శర్మకు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపాక ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సిఎం సమక్షంలో ఏసీబీ డిజి ఖాన్, ఎజి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏసిబి కోర్టు ‘ఓటుకు నోటు’ కేసును దర్యాప్తు చేయాల్సిందిగ ఆదేశించిన నేపథ్యాన్ని గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. కేసులో తదుపరి చర్యలపై గవర్నర్‌తో సిఎం చర్చించినట్టు తెలిసింది. ఎకె ఖాన్, రామకృష్ణారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా గవర్నర్‌తో సిఎం కెసిఆర్ దాదాపు రెండు గంటల పాటు మంతనాలు సాగించారు. గవర్నర్‌తో ఏకాంతంగా ముఖ్యమంత్రి ఏ విషయం చర్చించారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.