ఆంధ్రప్రదేశ్‌

విపత్తుల నిర్వహణలో ‘బీమా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 30: విపత్తుల నిర్వహణ సమగ్ర ప్రణాళికలో బీమా అంశాన్ని కూడా చేర్చాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్ తెలిపారు. పట్టణీకరణ నేపథ్యంలో వస్తున్న వివిధ సమస్యలను దృష్టిలో ఉంచుకుని విపత్తుల నిర్వహణ ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. హుదూద్ తుపాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణకు సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ప్రకంపన పేరుతో మూడు రోజుల పాటు నిర్వహించే సమావేశాలు విశాఖలోని సముద్రిక ఆడిటోరియంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాలో 8 నుంచి 10 శాతం మేర బీమా సౌకర్యం ఉంటుందని గుర్తుచేశారు. భారత్‌లో ఆ విధంగా బీమా సౌకర్యం లేకపోవడంతో ఎక్కువ నిధులు విపత్తుల సమయంలో ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని విపత్తుల నిర్వహణకు సమగ్ర ప్రణాళిక రూపకల్పనలో ఈ అంశాన్ని కూడా పొందుపరచాలన్నారు. వివిధ విపత్తులను ఎదుర్కొనేందుకు కొత్త పద్ధతులను వినియోగిస్తున్నామన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఉపయోగించి రియల్‌టైమ్ సొల్యూషన్స్ విధానాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని తెలిపారు. టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలను ఆవిష్కరిస్తున్నారని, పశ్చిమ దేశాల్లో 200 సంవత్సరాల్లో, దక్షిణాసియా దేశాలు 70 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధిని కొత్త విధానాల వల్ల 15 సంవత్సరాల్లోనే సాధించగలుగుతున్నామన్నారు. కాగా విశాఖలో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు (ఎస్‌డిఆర్‌ఎఫ్) ఏర్పాటు స్థలం కేటాయించనున్నట్లు రాష్ట్ర మావన వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విపత్తుల సమయంలో సంసిద్ధత కారణంగా మృతుల సంఖ్య తగ్గించగలుగుతున్నామన్నారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ మాట్లాడుతూ హదూద్ తుపాను నేపథ్యంలో అమలు చేసిన ఉత్తమ విధానాలు, లోపాలను పరిశీలన చేసేందుకు ఇవి దోహదపడతాయన్నారు.