ఆంధ్రప్రదేశ్‌

విపత్తులను ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 31: విపత్తుల నిర్వహణలో లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకే ‘ప్రకంపన’ పేరుతో విపత్తు నిర్వహణ విన్యాసాలను చేపట్టిన్నట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ తెలిపారు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం రెండో రోజైన బుధవారం విపత్తు సంభవించినప్పుడు విమానాలు, హెలికాప్టర్లు, నౌకలువంటి వాటి ద్వారా సహాయ, పునరావాస చర్యలు చేపట్టే విన్యాసాలను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోస్తా తీరం ఎక్కువగా తుపానుల ప్రభావానికి గురి అవుతుంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తుపానుల సమయంలో సహాయ, పునరావాస చర్యల గురించి చర్చించి సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా 250 మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నారని, మరికొంత మంది తమ అభిప్రాయలను తెలియచేశారన్నారు. వీటన్నింటిని కలిపి పుస్తక రూపంలో జాతీయ విపత్తుల నిర్వహణా సంస్థకు పంపనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఈ సమావేశాల్లో తుపానులు సంభవించినప్పుడు తీసుకున్న చర్యలు, అనుసరించిన పద్ధతులను పరిశీలిస్తామన్నారు. లోపాలను గుర్తించి తగిన విధానాలను, కమ్యూనికేషన్ వ్యవస్థ వంటివి రూపొందిస్తామన్నారు. ఈ ఏడాది జూన్‌లో గౌహతిలో పట్టణ ప్రాంతాల్లో వర్షం, వరదల నేపథ్యంలో సమావేశాలను నిర్వహించామన్నారు. సెప్టెంబర్ 15 నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ భుజ్‌లో భూకంపాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చిస్తారన్నారు. ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు ఈ తరహా సమావేశాలు నిర్వహిస్తున్నారని వివరించారు. కాగా,హుదుహుద్ తుపాను సమయంలో చెట్లను తొలగించేందుకు కావాల్సిన పవర్ రంపాల వంటివి తగినన్ని లేకపోవడం గుర్తించామన్నారు. విపత్తుల నిర్వహణలో సామగ్రి నిర్వహణ కూడా కీలకమన్నారు. విపత్తులు సంభవించినప్పుడు మొట్టమెదట స్పందించేది నౌకాదళమేనని గుర్తు చేశారు.
చిత్రం...ఐఎన్‌ఎస్ జలాశ్వ నౌకలో వివిధ పరికరాల గురించి తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ బిస్త్‌కు వివరిస్తున్న దృశ్యం